News April 14, 2025
విజయవాడలో రోప్ వే.. ఈసారి కన్ఫామ్

భవానీ ఐలాండ్‌కు రోప్‌వే కల సాకారమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఎదురైన భౌగోళిక, ఆధ్యాత్మిక అడ్డంకులను దృష్టిలో ఉంచుకొని, ఈసారి హరిత బర్మా పార్క్ నుంచి నేరుగా భవానీ ద్వీపం వరకూ 0.88 కి.మీ దూరంలో రోప్‌వే ఏర్పాటు చేయాలని ఏపీటీడీసీ కార్యాచరణ రూపొందిస్తోంది. త్వరలో బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుని ప్రాజెక్టును PPP విధానంలో అప్పగించనున్నారు.
Similar News
News September 16, 2025
అన్నమయ్య: ‘బొప్పాయి తక్కువకు అడిగితే కాల్ చేయండి’

అన్నమయ్య జిల్లాలో సెప్టెంబర్ 16వ తారీఖున టాప్ గ్రేడ్ బొప్పాయి ఎగుమతి ధర కిలో రూ.8లుగా నిర్ణయించబడిందని జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ పేర్కొన్నారు. సెకండ్ గ్రేట్ బొప్పాయి ఎగుమతి ధర కిలో రూ.7లుగా నిర్ణయించామని ఆయన అన్నారు. ఎవరైనా ట్రేడర్లు తక్కువ ధరకు కొనుగోలు చేస్తే వారిపై ఫిర్యాదు చేసేందుకు కంట్రోల్ రూమ్ నంబర్ (9573990331, 9030315951) సంప్రదించవచ్చని రైతులకు సూచించారు.
News September 16, 2025
నేరస్థులకు శిక్ష పడేలా కృషి చేయాలి: ఎస్పీ రోహిత్ రాజు

ప్రతి కేసులో సమగ్ర దర్యాప్తు నిర్వహించి, నేరస్థులకు శిక్ష పడేలా పోలీసులు కృషి చేయాలని భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో జరిగిన నెలవారీ నేర సమీక్షలో ఆయన మాట్లాడారు. ‘క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ ద్వారా నేరస్థులకు శిక్ష పడేలా చేసి బాధితులకు న్యాయం చేకూర్చాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
News September 16, 2025
సంగారెడ్డి: ఈనెల 18న ఉమ్మడి జిల్లా ఎంపికలు

ఉమ్మడి మెదక్ జిల్లా బాక్సింగ్ ఎంపికలు ఈ నెల 18న సంగారెడ్డిలోని సెయింట్ ఆంటోనీ పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు స్కూల్ గేమ్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. బాల బాలికల అండర్- 14, 17 ఎంపికలు జరుగుతాయని చెప్పారు.