News April 14, 2025
విజయవాడలో రోప్ వే.. ఈసారి కన్ఫామ్

భవానీ ఐలాండ్‌కు రోప్‌వే కల సాకారమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఎదురైన భౌగోళిక, ఆధ్యాత్మిక అడ్డంకులను దృష్టిలో ఉంచుకుని, ఈసారి హరిత బర్మా పార్క్ నుంచి నేరుగా భవానీ ద్వీపం వరకూ 0.88 కి.మీ దూరంలో రోప్‌వే ఏర్పాటు చేయాలని ఏపీటీడీసీ కార్యాచరణ రూపొందిస్తోంది. త్వరలో బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుని ప్రాజెక్టును PPP విధానంలో అప్పగించనున్నారు.
Similar News
News October 23, 2025
కృష్ణా: పొలాలపై వరుణుడి ఎఫెక్ట్

జిల్లాలో నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో పలు ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగిపోయాయి. కంకి దశకు చేరిన వరి పంటలు పాడైపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికందే సమయంలో వర్షాలు విరుచుకుపడడంతో నష్టపోతున్నామని వారు ఆందోళన చెందుతున్నారు. వర్షం మరికొన్ని రోజులు కొనసాగితే పంటలు పూర్తిగా నాశనం అయ్యే ప్రమాదం ఉందని రైతులు భయపడుతున్నారు.
News October 23, 2025
కృష్ణా జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ డీకే బాలాజీ ఓ ప్రకటనలో తెలిపారు. వర్షాల కారణంగా ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా కంట్రోల్ రూమ్ నెంబర్ 08672-252572 నెంబర్ కు ఫోన్ చేసి తెలియజేయాలన్నారు. సహాయ సహకారాలు అందించేందుకు జిల్లా అధికార యంత్రాంగం అంతా 24/7 సహాయచర్యలు అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు.
News October 23, 2025
కృష్ణా: వర్షంతో రోడ్లు అస్తవ్యస్తం

అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో కురుస్తున్న వర్షాలకు పట్టణం, పరిసర గ్రామాల్లో రహదారులు అస్తవ్యస్తంగా మారాయి. రోడ్లు నీట మునగడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో పారిశుధ్య పరిస్థితులు దారుణంగా మారి, వర్షపునీరు, మురుగు కలసి కాలువల నుండి బయటకు పొంగి దుర్వాసన వ్యాపిస్తోంది. అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.