News September 1, 2024

విజయవాడలో వర్షం.. మీ ప్రాంతం ఇప్పుడు ఎలా ఉంది!

image

జిల్లాతో పాటు విజయవాడలో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల ప్రజలు వరద నీటితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికార యంత్రాంగం వెంటనే స్పందిస్తూ సహాయక చర్యలు చేపడుతోంది. మరికొన్ని ప్రాంతాల ప్రజలు ఇళ్లలోనే చిక్కుకొని ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా లేకపోవడం, చీకటి పడుతుండటంతో సాయం కోసం ఎదురు చూస్తున్నారు. మీ ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉందో కామెంట్ చేయండి.

Similar News

News September 14, 2024

విజయవాడ: ధనుష్ సినిమా మళ్లీ థియేటర్లలోకి వస్తోంది

image

ధనుష్, శృతిహాసన్ జంటగా నటించిన ‘3’ (2012) సినిమా సెప్టెంబర్ 14న రీరిలీజ్ కానుంది. సెప్టెంబర్ 14 నుంచి 16 వరకు విజయవాడలోని నాలుగు థియేటర్‌లలో ఈ సినిమా ప్రదర్శించనున్నారు. కాగా ఈ చిత్రంలోని “వై దిస్ కొలవెరి”తో పాటు ఇతర పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో విజయవాడలో ఈ సినిమా టికెట్లు ఆన్‌లైన్‌లో వేగంగా అమ్ముడవుతున్నాయి.

News September 14, 2024

కృష్ణా జిల్లా TODAY TOP NEWS

image

* విజయవాడలో బాడీ మసాజ్ సెంటర్‌పై పోలీసుల దాడి
* విజయవాడ రైల్వేస్టేషన్‌‌కు స్పెషల్ గుర్తింపు
* కృష్ణా జిల్లాలో కలకలం.. ఒకే ఇంట్లో 100పాములు
* ఇబ్రహీంపట్నంలో రోడ్డు ప్రమాదం(వీడియో)
* జోగి రమేశ్, అవినాశ్‌కు సుప్రీంలో ఊరట
* మంత్రి కొల్లు రవీంద్రకు HIGH COURTలో ఊరట
* ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న ముంబై సినీ నటి

News September 13, 2024

కృష్ణా: దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు రూ.186 కోట్లు

image

రోడ్లు భవనాల శాఖపై సచివాలయంలో సీఎం చంద్రబాబు శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డితో పాటు ఆ శాఖ అధికారులు పాల్గొన్నారు. భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు రూ.186 కోట్లు విడుదల చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. కాగా రోడ్లపై గుంతలు పూడ్చేందుకు మరో రూ.290 కోట్లు మంజూరు చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.