News October 29, 2024
విజయవాడలో విశాఖ బాలిక మృతి

విశాఖకు చెందిన చిన్నారి విజయవాడలోని ఓ హోటల్ కిటికీ నుంచి జారిపడి మృతిచెందింది. ఈ ఘటన సోమవారం జరిగింది. విశాఖకు చెందిన బదరీ నాగరాజు తన కుటుంబంతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లాడు. ఈ క్రమంలో ఈనెల 26న విజయవాడలోని ఓ హోటల్లో దిగారు. 27న ఉదయం అతని కుమార్తె రుహిక(4), సోదరునితో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కిటికీ నుంచి జారి పడింది. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందినట్లు మాచవరం పోలీసులు తెలిపారు.
Similar News
News December 4, 2025
విశాఖలో నేవీ అమరవీరులకు నివాళి

విశాఖ బీచ్ రోడ్డులోని ‘విక్టరీ ఎట్ సీ’ వద్ద తూర్పునౌకదళ అధికారులు, కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అమరులైన నావిక దళ వీరులకు నివాళులర్పించారు. రక్షణ వ్యవస్థలో తూర్పునౌకదళం కీలకంగా పనిచేస్తుందని వారు కొనియాడారు. నేవీ డే సందర్భంగా గురువారం ఉదయం ఈ కార్యక్రమం నిర్వహించారు. కాగా ఈ ఏడాది విశాఖలో నేవీ డే విన్యాసాలను నిర్వహించకపోవడంతో నగరవాసులు నిరుత్సాహానికి గురయ్యారు.
News December 4, 2025
జీవీఎంసీలో విలీనం కానున్న గ్రామీణ మండలాలివే..!

ఉమ్మడి విశాఖ జిల్లా విభజన అనంతరం మిగిలిపోయిన 4 మండలాలైన ఆనందపురం, పద్మనాభం, భీమిలి, పెందుర్తిని GVMCలో విలీనం చేసే ప్రక్రియ జరుగుతోంది. భీమిలి నియోజకవర్గ పరిధిలోని 3 గ్రామీణ మండలాలు (భీమిలి, పద్మనాభం, ఆనందపురం) GVMCలో కలిపేందుకు CM చంద్రబాబు, మంత్రులు నారా లోకేశ్, నారాయణ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారని ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ తెలిపారు. దీంతో GVMC పరిధి విస్తరణతో పాటు వార్డులు కూడా పెరగనున్నాయి.
News December 4, 2025
వాల్తేరు డివిజన్లో రైళ్ల రాకపోకలు నిలిపివేత

గరివిడి-సిగడం-చీపురుపల్లి సెక్షన్లో ఆటో సిగ్నలింగ్ పనుల కారణంగా కొన్ని రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు వాల్తేరు రైల్వే డివిజనల్ కార్యాలయం బుధవారం తెలిపింది. ఈనెల 6, 7, 8 తేదీల్లో విశాఖ-పలాస మెము (67289/67290), విశాఖ-బ్రహ్మపురం ప్యాసింజర్ (58531/58532), విశాఖ-బ్రహ్మపూర్ ఎక్స్ప్రెస్ (18525/18526) సేవలు నిలిపివేసినట్లు వెల్లడించారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు సూచించారు.


