News January 31, 2025
విజయవాడలో వ్యభిచారం.. మహిళ అరెస్ట్

వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు నిర్వహించారు. సూర్యారావుపేట పోలీసులు తెలిపిన సమాచారం మేరకు కోదండరామిరెడ్డి వారి వీధిలో ఓ అపార్ట్మెంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో గురువారం సాయంత్రం దాడి చేశామన్నారు. ఈ దాడిలో ఓ మహిళను తీసుకొని ఆమె వద్ద నుంచి 3 సెల్ ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిర్వాహకురాలు నాగమణి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
Similar News
News February 18, 2025
పిట్లం: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి.. మరొకరికి పరిస్థితి విషమం

పిట్లం శివారులోని NH- 161 పై మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళా మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న హైవే సిబ్బంది ఘటన స్థలికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తికి చికిత్స నిమిత్తం పిట్లం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 18, 2025
ADB: కత్తిపోట్ల ఘటన UPDATE

తలమడుగు మండలం రుయ్యాడిలో ఓ వ్యక్తి <<15500882>>దారుణ హత్య<<>>కు గురయ్యాడు. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామంలో బావబామ్మర్దుల మధ్య గొడవ జరిగింది. మాటామాటా పెరగడంతో బావ మహేందర్‌పై బామ్మర్ది అశోక్ కత్తితో దాడి చేశాడు. దీంతో మహేందర్ అక్కడికక్కడే మరణించాడు. కుటుంబ కలహాలు నేపథ్యంలో హత్య జరిగినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం రిమ్స్‌కు తరలించారు.
News February 18, 2025
వికారాబాద్: కేసులు పెండింగ్ ఉంచరాదు: ఎస్పీ

పాత కేసులను పెండింగ్ పెట్టరాదని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి సిబ్బందికి సూచించారు. మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ ఎస్టీ , పోక్సో కేసులపై దృష్టి పెట్టాలన్నారు. 100 డైల్ వస్తే నిర్లక్ష్యం వహించొద్దని తెలిపారు. రోడ్డు ప్రమాదాలపై దృష్టి పెట్టాలన్నారు.