News February 24, 2025
విజయవాడలో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

వ్యభిచార గృహంపై ఆదివారం పోలీసులు దాడి చేశారు. మాచవరం సీఐ ప్రకాశ్ తెలిపిన సమాచారం ప్రకారం.. మారుతి నగర్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు దాడి చేశామన్నారు. ఈ దాడిలో ఒక యువతి, నలుగురు విటులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. అలాగే ఆర్గనైజర్ సంపత్ కుమార్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు. వీరి వద్ద నుంచి నాలుగు ఫోన్లు, రూ.17,400 నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
Similar News
News October 16, 2025
గుజరాత్ మంత్రులంతా రాజీనామా

గుజరాత్లో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. స్థానిక ఎన్నికల దృష్ట్యా క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ కోసం ముఖ్యమంత్రి తప్ప మిగతా 16 మంది మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. కాసేపట్లో సీఎం భూపేంద్ర పటేల్ గవర్నర్‌ను కలవనున్నారు. రేపు ఉదయం 11.30 గంటలకు కొత్త క్యాబినెట్ కొలువుదీరనుంది. నూతన మంత్రివర్గంలో 10 మంది కొత్తవారికి అవకాశం దక్కనున్నట్లు సమాచారం.
News October 16, 2025
23 నుంచి అన్ని పాఠశాలల్లో ఆధార్ నవీకరణ: కలెక్టర్

విద్యార్థుల ఆధార్ నవీకరణకు ఈనెల 23 నుంచి అన్ని పాఠశాలల్లో ఆధార్ నవీకరణ ప్రారంభిస్తామని కలెక్టర్ వినోద్ కుమార్ గురువారం తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో 110 ఆధార్ నమోదు కేంద్రాలు ఉండగా, ప్రస్తుతం 80 కేంద్రాలు పని చేయడంతో వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
News October 16, 2025
నక్సలిజంపై పోరులో ల్యాండ్‌మార్క్ డే: అమిత్‌షా

ఛత్తీస్‌గఢ్‌లో ఇవాళ 170 మంది నక్సలైట్లు సరెండర్ అయ్యారని, నక్సలిజంపై పోరులో ల్యాండ్‌మార్క్ డే అని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వెల్లడించారు. ‘ఛత్తీస్‌గఢ్‌లోని అభూజ్మఢ్, నార్త్ బస్తర్ నక్సల్ టెర్రర్ నుంచి విముక్తి పొందాయి. 2024 JAN నుంచి 2,100 మంది నక్సలైట్లు సరెండరయ్యారు. 1,785 మంది అరెస్టయ్యారు. 477 మంది హతమయ్యారు. 2026 MAR 31లోపు నక్సలిజం అంతరిస్తుందనడానికి ఈ నంబర్లు నిదర్శనం’ అని ట్వీట్ చేశారు.