News February 24, 2025

విజయవాడలో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

image

వ్యభిచార గృహంపై ఆదివారం పోలీసులు దాడి చేశారు. మాచవరం సీఐ ప్రకాశ్ తెలిపిన సమాచారం ప్రకారం.. మారుతి నగర్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు దాడి చేశామన్నారు. ఈ దాడిలో ఒక యువతి, నలుగురు విటులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. అలాగే ఆర్గనైజర్ సంపత్ కుమార్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు. వీరి వద్ద నుంచి నాలుగు ఫోన్లు, రూ.17,400 నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 

Similar News

News March 27, 2025

వనపర్తి: క్రికెట్ ఆడి ఉత్సాహపరిచిన ఎస్పీ

image

క్రికెట్ ఆడి క్రీడాకారులను జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఉత్సాహపరిచారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీసు కార్యాలయం క్రీడ మైదానంలో ప్రభుత్వ వైద్య కళాశాల వారి ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షిక క్రీడలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన క్రికెట్ ఆడి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, క్రీడాకారులు స్నేహ పూర్వకంగా మెలగాలని ఆయన పేర్కొన్నారు.

News March 27, 2025

రేవంత్ ‘తెలంగాణ బూతుపిత’ అవుతారు: KTR

image

TG: ఎవ్వరు ఏమనుకున్నా తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని BRS ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. రేవంత్ తెలంగాణ బూతుపిత అవుతారని ఎద్దేవా చేశారు. తుపాకుల గురించి రేవంత్‌కు తెలిసినంత తమకు తెలియదన్నారు. ఉద్యమకారులపై గన్ను ఎక్కుపెట్టిన చరిత్ర ఆయనదని దుయ్యబట్టారు. ప్రజాపాలన విఫల పాలన అని ఏ ఒక్క హామీని అమలు చేయలేదని మండిపడ్డారు. అప్పులు, అబద్దాలు, బూతులు, అన్నదాతల ఆత్మహత్యలలో తెలంగాణ రైజింగ్ అని విమర్శలు చేశారు.

News March 27, 2025

KCRను బండకేసి కొట్టారు: సీఎం రేవంత్

image

BRS నేతలు తెలంగాణ గాంధీగా పిలుచుకునే KCRను కామారెడ్డి ప్రజలు బండకేసి కొట్టారని సీఎం రేవంత్ అసెంబ్లీలో అన్నారు. ‘నాకు ఓడిపోవడం కొత్త కాదు. కామారెడ్డిలో నేను పోతూ పోతూ.. నిన్ను కూడా తీసుకెళ్తానని చెప్పా. అనుకున్నట్టుగానే అక్కడి ప్రజలు సామాన్యుడిని గెలిపించారు. ప్రజలు తిరస్కరించినా BRS నేతలు ఎందుకు బుకాయిస్తున్నారు? KCR వందేళ్లు ఆరోగ్యంగా ఉండి ప్రతిపక్ష నేత బాధ్యత నిర్వర్తించాలి’ అని ఆకాంక్షించారు.

error: Content is protected !!