News April 18, 2025

విజయవాడలో శవమై తేలిన భూపాలపల్లి మహిళ

image

భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలానికి చెందిన మహిళ విజయవాడలో శవమై తేలింది. KU ఎస్సై శ్రీకాంత్ వివరాలు.. భావుసింగ్‌పల్లి గ్రామానికి చెందిన స్రవంతి కుటుంబంతో కొంత కాలంగా HNK భీమారంలో ఉంటోంది. అయితే పెళ్లైన చాలా ఏళ్ల తర్వాత రెండు నెలల క్రితం ఆమెకు బాబు జన్మించాడు. అప్పటి నుంచి ఆమె మానసిక సమస్యతో బాధపడుతోంది. ఈనెల 15న ఇంట్లోంచి వెళ్లిపోయన స్రవంతి గురువారం విజయవాడ ప్రకాశం బ్యారేజీ(ఏపీ) వద్ద శవమై తేలింది.

Similar News

News December 27, 2025

TTD సిబ్బందిపై చర్యలు

image

తిరుపతి SGS పాఠశాల విద్యార్థులను సస్పెండ్ చేశారు. ఇందులో సిబ్బంది నిర్లక్ష్యం సైతం ఉండగా వారిపై చర్యలు తీసుకోలేదు. ఇదే విషయం Way2Newsలో వార్తగా రావడంతో TTD డీఈవో స్పందించారు. పాఠశాల HM చంద్రయ్యతో సమావేశం నిర్వహించారు. హాస్టళ్ల నుంచి విద్యార్థులు బయటకు వెళ్లే అవకాశం ఇచ్చిన సిబ్బంది ఇద్దరిని బదిలీ చేయనున్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారిని తిరిగి క్లాస్‌లకు అనుమతించనున్నారు.

News December 27, 2025

GNT: నేడు జీఎంసీ కౌన్సిల్ సమావేశం .

image

గుంటూరు నగరపాలకసంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో శనివారం కౌన్సిల్ సాధారణ సమావేశం జరగనుంది. ఈ మేరకు మేయర్ కోవెలమూడి రవీంద్ర అధ్యక్షతన ఉదయం 10:30 గంటల నుంచి సమావేశం నిర్వహించనున్నట్లు కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు ఈ సమావేశానికి హాజరవ్వాలని కమిషనర్ శ్రీనివాసులు పిలుపునిచ్చారు.

News December 27, 2025

కర్నూలు జిల్లాలో 17,089 ఓపెన్ డ్రింకింగ్ కేసులు: ఎస్పీ

image

కర్నూలు జిల్లాలో బహిరంగ మద్యపానంపై ఉక్కుపాదం మోపుతున్నట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబర్ 20 వరకు 17,089 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇకపై బహిరంగ మద్యపానాన్ని ఏమాత్రం ఉపేక్షించబోమని, ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు.