News February 13, 2025
విజయవాడలో స్లాబ్ కూలి వ్యక్తి మృతి

శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధర్మవరపు కృష్ణ (33) బతుకు తెరువు కోసం కుటుంబంతో కలిసి ఏడాది క్రితం విజయవాడకి వచ్చి గుణదలలో అద్దెకు ఉంటున్నారు. కృష్ణ సెంట్రింగ్ పనులకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం కనకదుర్గ నగర్లో సెంట్రింగ్ పనులు చేస్తుండగా ఎలివేషన్ స్లాబ్ కూలి కృష్ణపై పడింది. దీంతో అతనికి తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందినట్లు పటమట పోలీసులు తెలిపారు.
Similar News
News November 28, 2025
MHBD జిల్లాలో మహిళా ఓటర్లే అధికం!

MHBD, కేసముద్రం, మరిపెడ, తొర్రూర్, డోర్నకల్ మున్సిపాలిటీలు మినహా.. మిగిలిన 18 మండలాల్లో మొత్తం 5,56,780 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో మహిళలు 2,83,064 ఉండగా, 2,73,682 మంది పురుషులు, 24 మంది ఇతరులు ఉన్నట్లు తెలిపారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 482 గ్రామపంచాయతీ, 4110 వార్డు స్థానాలకు అధికారులు రిజర్వేషన్లు ఖరారు కాగా.. నామినేషన్ల ప్రక్రియ మొదలైంది.
News November 28, 2025
NLG: అప్పుడు వార్డు మెంబర్.. ఇప్పుడు మండలి ఛైర్మన్!

గుత్తా సుఖేందర్ రెడ్డి.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ పేరు తెలియని వారు ఉండరు. గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన శాసనమండలి ఛైర్మన్‌గా అంచలంచెలుగా ఎదిగారు. వార్డు సభ్యుడు.. మండలి ఛైర్మన్ వరకు ఎదగడం రాజకీయాల్లోకి కొత్తగా వచ్చే వారికి స్ఫూర్తినిస్తుంది. సుఖేందర్ రెడ్డి 1978లో రాజకీయాల్లోకి వచ్చారు. 1981లో ఉరుమడ్ల జీపీలో వార్డు సభ్యుడిగా పోటీ చేసి విజయం సాధించారు.
News November 28, 2025
‘అమరావతిలో పరిష్కారమైన లంక భూముల సమస్య’

రాజధాని ల్యాండ్ పూలింగ్‌కు లంక భూమలు ఇచ్చిన రైతుల సమస్య పరిష్కారం అయిందని మంత్రి నారాయణ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చిన రైతుల ప్లాట్లకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైందని, లంక భూములిచ్చిన రైతులు తమ రిటర్నబుల్ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని వెల్లడించారు. ఆయా గ్రామాలకు సంబంధించిన యూనిట్ ఆఫీసుల వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకునే సౌకర్యం కల్పించామన్నారు.


