News December 1, 2024

విజయవాడలో హరిహరవీరమల్లు షూటింగ్‌

image

హీరోయిన్ నిధి అగర్వాల్ విజయవాడలో జరుగుతున్న హరిహరవీరమల్లు షూటింగ్‌లో ఉన్నానని తన ఇన్‌స్టాలో ఆదివారం పోస్ట్ చేశారు. ఈ షూటింగ్‌లో పాల్గొనే నిమిత్తం ఆమె నిన్న విజయవాడ చేరుకున్నట్లు పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ చిత్రానికి MM కీరవాణి మ్యూజిక్ అందిస్తుండగా ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. 

Similar News

News January 24, 2026

కృష్ణా: ద్విచక్ర వాహనదారులకు కలెక్టర్ సూచనలు

image

కలెక్టర్ డీకే బాలజీ శనివారం ఉదయం మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారిపై రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మూడు స్తంభాల సెంటర్ వద్ద స్వయంగా తనిఖీలు చేపట్టిన ఆయన, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులకు జరిమానాల కంటే ముందు ప్రాణ రక్షణ పట్ల అవగాహన కల్పించి అందరి ప్రశంసలు అందుకున్నారు. అనంతరం ఆయన ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌లు అందజేశారు.

News January 24, 2026

26న జరిగే పీజీఆర్ఎస్ రద్దు: కలెక్టర్

image

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 26వ తేదీన కలెక్టరేట్‌లో నిర్వహించనున్న PGRSను రద్దు చేసినట్టు కలెక్టర్ డీకే బాలాజీ శనివారం తెలిపారు. అధికారులంతా ఆ రోజు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్న నేపథ్యంలో రద్దు చేసినట్లు చెప్పారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. జిల్లా పోలీస్ ఆఫీస్‌లో నిర్వహించే PGRSను కూడా రద్దు చేసినట్లు SP విద్యాసాగర్ వెల్లడించారు.

News January 23, 2026

కృష్ణా: జెడ్పీలో 25 మందికి పదోన్నతులు

image

జిల్లా పరిషత్‌లో పనిచేస్తున్న 25 మంది జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులకు పదోన్నతి కల్పించారు. శుక్రవారం జెడ్పీ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో పదోన్నతి పొందిన వారికి జెడ్పీ ఛైర్‌పర్సన్ ఉప్పాల హారిక పదోన్నతి ఉత్తర్వులు అందజేశారు. జెడ్పీ హైస్కూల్స్‌లో 20 మంది, ఎంపీడీఓ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఐదుగురు టైపిస్ట్‌లకు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించినట్లు ఆమె తెలిపారు.