News March 21, 2025
విజయవాడలో 100 బృందాలతో తనిఖీలు

డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా నిర్ధేశాను సారం ఈగల్ టీమ్ ఐజీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్, స్థానిక పోలీసులు, డ్రగ్స్ డిపార్ట్ మెంట్ల ఆధ్వర్యంలో శుక్రవారం టీమ్‌గా ఏర్పడి మెడికల్ షాపులు, మెడికల్ ఏజెన్సీలపై దాడులు నిర్వహించారు. ఈగల్ యాంటీ-నార్కొటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఐజీ ఆకే రవి కృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 100 బృందాల ఆధ్వర్యంలో ఆపరేషన్ గరుడను నిర్వహించినట్లు తెలిపారు.
Similar News
News November 28, 2025
NTR: ఆ MLA తీరు అంతేనా.? షాక్‌కి గురైన నేతలు, అధికారులు.!

మంత్రి సత్యకుమార్ ఆధ్వర్యంలో విజయవాడలో నిన్న జరిగిన వైద్య సేవల సమీక్షలో MLA తీరు చర్చనీయాంశమైంది. పాత ప్రభుత్వాసుపత్రిలో చివరి దశకు చేరుకున్న క్రిటికల్ కేర్ యూనిట్ నిర్మాణంలో రూ.3కోట్ల అవినీతి జరిగిందంటూ విజయవాడకు చెందిన ఓ MLA ఆరోపించారు. నిర్మాణం నిలిపివేసి విచారణ జరపాలని పట్టుబట్టడంతో, తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రోగుల పరిస్థితిని పట్టించుకోకుండా MLA మాట్లాడటంపై సమావేశంలో అసహనం వ్యక్తమైంది.
News November 28, 2025
కేజీహెచ్‌లో బ్రెస్ట్ ఫీడింగ్ యూనిట్ ప్రారంభం

కేజీహెచ్‌లోని గైనిక్ వార్డులో బాలింతల కోసం బ్రెస్ట్ ఫీడింగ్ యూనిట్ ప్రాజెక్ట్‌ను ఆయుష్మాన్‌లో భాగంగా ఏర్పాటు చేశారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ ఐ.వాణి ఈ యూనిట్ ప్రారంభించారు. ఈ యూనిట్‌తో పిల్లల తల్లులకు అన్ని రకాల ఉపయోగాలు చేకూరుతాయని సూపరింటెండెంట్ వివరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య వైద్యులు, సిబ్బంది, నిర్వాహకులు పాల్గొన్నారు.
News November 28, 2025
గంగాధర: రూపాయి బిళ్లలతో సర్పంచ్ నామినేషన్

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన జంగిలి మహేందర్ అనే యువకుడు వినూత్నంగా రూపాయి బిళ్లలతో నామినేషన్ వేశారు. గత ఎన్నికల్లో వార్డు మెంబర్‌గా పోటీ చేసిన మహేందర్.. ఒక్క ఓటుతో ఓటమి చెందారు. దీంతో ఒక్క ఓటు విలువ తెలియడంతో ఈసారి సర్పంచ్ అభ్యర్థిగా వెయ్యి రూపాయి బిళ్లలతో నామినేషన్ వేసినట్లు మహేందర్ చెప్పారు.


