News February 27, 2025

విజయవాడలో 144 సెక్షన్: ఏసీపీ దామోదర్

image

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు విజయవాడలో 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని సెంట్రల్ ఏసీపీ దామోదర్ తెలిపారు. అదనపు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఎవరైనా అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. సెంట్రల్ జోన్ పరిధిలో 15 పోలింగ్ బూత్‌లు, ఆరు పోలింగ్ స్టేషన్లో ఉన్నట్లు తెలిపారు. పోలింగ్ స్టేషన్‌కు 100 మీటర్ల లోపు వ్యాపార దుకాణాలు మూసివేయాలన్నారు.

Similar News

News November 28, 2025

నెల్లూరులో గూడూరును కలవనీయకుండా అందుకే అడ్డుకున్నారా.?

image

గూడూరును నెల్లూరులో కలవనీయకుండా ఓ బడా పారిశ్రామికవేత చక్రం తిప్పినట్లు సమాచారం. 3 నియోజకవర్గాల్లో క్వార్జ్, అబ్రకం, మైకా వంటి ఖనిజాలు పుష్కలం. ఇవి నెల్లూరుకు వెళితే ఖనిజాలపై ‘రెడ్ల’ ఆధిపత్యం పెరుగుతుందని దీనిని అడ్డుకోవడానికి ఇలా చేసినట్లు తెలుస్తోంది. ఆయన ఎన్నికల్లోనూ ఆర్థికంగా ప్రభావం చూపించారట. తిరుపతి గ్రేటర్ పరిధి పెరుగుతన్న క్రమంలో గూడూరును సాంకేతికంగా నెల్లూరులో కలపలేదన్న వాదన కూడా ఉంది.

News November 28, 2025

సిద్దిపేట: బీసీ సంక్షేమంపై మంత్రి పొన్నం సమీక్ష

image

మినిస్టర్ క్వార్టర్స్‌లో బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. తెలంగాణ రైజింగ్–2047 పాలసీలో రాష్ట్ర అభివృద్ధిని ప్రతిబింబించే విధంగా, రాబోయే గ్లోబల్ సమ్మిట్‌లో బీసీ సంక్షేమ శాఖ ప్రాధాన్యాంశాలను చర్చించారు. శాఖ పనితీరు, భవిష్యత్ కార్యక్రమాలు, బీసీ వర్గాల అభ్యున్నతి కోసం తీసుకోవాల్సిన చర్యలను అధికారులు వివరించారు.

News November 28, 2025

SNBNCBSలో ఫ్యాకల్టీ పోస్టులు

image

సత్యేంద్రనాథ్ బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్సెస్ (SNBNCBS) ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ(అప్లైడ్ సైన్స్/ఇంజినీరింగ్)తో పాటు పని అనుభవం ఉండాలి. జీతం అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు నెలకు రూ.78,800, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,23,100 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.bose.res.in/