News January 25, 2025
విజయవాడలో 2 ఏళ్ల బాలుడి కిడ్నాప్.. కారణమిదే.!

విజయవాడ గవర్నర్ పేట పోలీసులు 2 ఏళ్ల బాలుడి మిస్సింగ్ కేసును ఛేదించిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల మేరకు.. కృష్ణా జిల్లాకు చెందిన ఓ బాలిక పిల్లలను కిడ్నాప్ చేసి అమ్మి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రిలోని ఓ బాలుడిని కిడ్నాప్ చేసిందని చెప్పారు. ఈ కేసును 4 గంటల వ్యవధిలో ఛేదించిన సీఐ నాగమురళి, ఎస్ఐలు దుర్గారావు, ప్రశాంతిలను సీపీ అభినందించారు.
Similar News
News November 22, 2025
HYD: పంచాయతీ ఎన్నికలు.. అబ్జర్వర్లతో ఎస్ఈసీ కీలక సమావేశం

తెలంగాణలో పంచాయితీ ఎన్నికల వేడి మొదలైంది. ఎన్నికల సిద్ధతల్లో భాగంగా ఈరోజు జిల్లాలవారీగా అబ్జర్వర్లతో ఎస్ఈసీ కీలక సమావేశం నిర్వహిస్తోంది. వచ్చే వారంలోనే పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తి దశలో ఉన్నాయి. అబ్జర్వర్లతో కీలక సమావేశం పూర్తయిన తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఒక నిర్ణయం తీసుకొని షెడ్యూల్ విడుదల చెయ్యనుంది.
News November 22, 2025
క్షమాపణలు చెప్పిన అల్-ఫలాహ్ వర్సిటీ

ఢిల్లీ పేలుడు ఘటనలో అల్-ఫలాహ్ వర్సిటీ పేరు రావడంతో, వారి వెబ్సైట్లో ఉన్న పాత అక్రిడిటేషన్ వివరాలపై NAAC షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై వర్సిటీ స్పందిస్తూ వెబ్సైట్ డిజైన్ లోపాలు కారణంగా ఈ పొరపాట్లు జరిగాయని క్షమాపణలు తెలిపింది. తప్పుడు సమాచారాన్ని తొలగించినట్లు పేర్కొంది. కాగా గడువు ముగిసిన తరువాత కూడా వర్సిటీ గ్రేడ్లను తమ సైట్లో కొనసాగిస్తూ వచ్చింది.
News November 22, 2025
హనుమకొండ: హిడ్మా ఫ్లెక్సీకి నివాళి.. ఇద్దరిపై కేసు నమోదు

HNK జిల్లా వేలేరు మండలం షోడశపల్లి గ్రామంలో ఇటీవల మృతి చెందిన మావోయిస్టు అగ్రనేత హిడ్మాకు నివాళులర్పిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు.


