News September 25, 2024
విజయవాడలో 25న హ్యాండ్ బాల్, చెస్ జట్ల ఎంపికలు
విజయవాడలోని కేబీఎన్ కళాశాలలోని క్రీడా మైదానంలో సెప్టెంబర్ 26న ఎస్జీఎఫ్ అండర్ 19 ఉమ్మడి కృష్ణా జిల్లా హ్యాండ్ బాల్, చెస్ జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అండర్ 19 ఎస్జీఎఫ్ కార్యదర్శి రతికాంత బుధవారం తెలిపారు. ఈ పోటీలకు 01-01-2006 తరువాత పుట్టినవారు అర్హులన్నారు. జిల్లాలో ఆసక్తి గలవారు జనన ధ్రువీకరణ, స్టడీ, ఆధార్ పత్రాలతో హాజరుకావాలన్నారు.
Similar News
News October 12, 2024
ఎన్టీఆర్ జిల్లాలోనే అత్యధికంగా దరఖాస్తులు
ఎన్టీఆర్ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా 113 మద్యం షాపుల కోసం 5,787 అప్లికేషన్లు వచ్చాయి. జిల్లాలోని ప్రతి షాపునకు సగటున 51 దరఖాస్తులు దాఖలైనట్లు తాజాగా సమాచారం వెలువడింది. ఈ నెల 12,13వ తేదీల్లో దరఖాస్తుల పరిశీలన అనంతరం 14వ తేదీన జిల్లా అధికారుల సమక్షంలో డ్రా తీసి మద్యం షాపులను కేటాయించనున్నట్లు అధికారులు చెప్పారు.
News October 12, 2024
కృష్ణా: ప్రత్యేక రైళ్లను పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే
దసరా ఉత్సవాల కోసం విజయవాడ(BZA) నుంచి శ్రీకాకుళం రోడ్(CHE) మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను ఈ నెల 17 వరకు పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 12,14,15,16,17 తేదీల్లో BZA-CHE(నం.07215) మధ్య, 12,13,15,16,17 తేదీల్లో CHE-BZA(నం.07216) రైళ్లు నడుపుతామన్నారు. విజయవాడలో ఈ రైళ్లు పై తేదీల్లో రాత్రి 8 గంటలకు బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 5.30 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటాయన్నారు.
News October 11, 2024
కృష్ణా: విమాన ప్రయాణికులకు శుభవార్త
విశాఖపట్నం నుంచి విజయవాడకు రాకపోకలు సాగించే ప్రయాణికుల సౌకర్యార్థం అక్టోబర్ 27న కొత్త విమాన సర్వీసును ప్రవేశపెట్టనున్నట్లు సంబంధిత వర్గాలు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశాయి. ఏపీ ఎయిర్ ప్యాసింజర్స్ అసోసియేషన్ అభ్యర్థన మేరకు ఈ నెల 27 నుంచి ఈ నగరాల మధ్య అదనపు విమాన సర్వీసును అందుబాటులోకి తెస్తామని నిర్వాహకులు స్పష్టం చేశారు. ప్రస్తుతం విశాఖ నుంచి విజయవాడకు నేరుగా ఒక విమానం మాత్రమే అందుబాటులో ఉంది.