News January 28, 2025
విజయవాడలో 30 మందికి జరిమానా

మద్యం తాగి వాహనాలు నడిపిన వారికి న్యాయస్థానం సోమవారం జరిమానా విధించింది. ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ కార్యాలయం తెలిపిన సమాచారం మేరకు.. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్-1 పరిధిలో 30 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిని న్యాయస్థానం ఎదుట హాజరు పరిచారు. న్యాయమూర్తి వెంకటశర్మ ఒక్కొక్కరికి 10000/- చొప్పున జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. మద్యం తాగి వాహనాలు నడిపితే మరోమారు జైలుపాలు అవుతారని హెచ్చరించారు.
Similar News
News October 30, 2025
NLG: పంట నష్టం.. క్షేత్రస్థాయిలో అధికారుల పరిశీలన!

మొంథా తుపాన్ కారణంగా ఉమ్మడి జిల్లాలో నష్టపోయిన పంటల వివరాలను సేకరించేందుకు వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరుపుతున్నారు. గ్రామాల్లో ఉన్న ఏఈఓల ద్వారా ఉన్నతాధికారులు వివరాలను సేకరిస్తున్నారు. ఏయే గ్రామాల్లో వంట ఎన్ని ఎకరాల్లో వరి పంట నేలకొరిగిందనే విషయాలను తెలుసుకుంటున్నారు. రైతుల వివరాలను, ఎన్ని ఎకరాల్లో నష్టపోయిందో రికార్డుల్లో నమోదు చేసుకుంటున్నారు.
News October 30, 2025
ఆదిలాబాద్: పత్తిచెనులో పులి

భీంపూర్ మండలంలోని తాంసి(కే) గ్రామంలోని వ్యవసాయ పొలాల్లో బుధవారం పులి సంచరిస్తోందని స్థానికులు తెలియజేశారు. దీంతో భయాందోళనలకు గురై పరుగులు తీయడం జరిగిందన్నారు. ఈ మేరకు అటవీశాఖ అధికారులు హైమద్ ఖాన్ను సంప్రదించగా.. పులి కోసం గాలింపు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. పరిసర ప్రాంతాల్లో పులి అడుగుల కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పరిసర ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
News October 30, 2025
అయోధ్య రామునికి రూ.3వేల కోట్ల విరాళం

అయోధ్యలో రామ మందిరం కోసం 2022 నుంచి ఇప్పటి వరకు రూ.3వేల కోట్లకుపైగా విరాళాలు అందాయి. ఇందులో దాదాపు రూ.1,500 కోట్లను నిర్మాణం కోసం ఖర్చు చేసినట్లు రామమందిర నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా వెల్లడించారు. నవంబర్ 25న ఆలయంలో జరిగే జెండా ఆవిష్కరణ వేడుకకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమానికి మరో 8 వేల మందిని ఆహ్వానించనున్నట్లు చెప్పారు.


