News January 12, 2025
విజయవాడ: ‘అప్పట్లో అరాచకాలు, ఇప్పుడు నీతులా?’

వైసీపీ ప్రభుత్వంలోనే ఇష్టానుసారంగా సంక్రాంతి సంబరాల పేరుతో క్యాసినోలు నిర్వహించిన ఘనత ఆ పార్టీ నేతలకే దక్కిందని తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షుడు చింతల అనిల్ కుమార్ విమర్శించారు. శనివారం విజయవాడలో తన కార్యాలయంలో అనిల్ వైసీపీపై మండిపడ్డారు. ఆరు నెలల కూటమి పాలనలో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. ఐదేళ్ల వైసీపీ కాలంలో ఆ పార్టీ నేతలు అరాచకాలు సృష్టించి, నేడు నీతులు వల్లించడం దారుణం అన్నారు.
Similar News
News October 18, 2025
తాడిగడపకు పాత పేరు ఖరారు

గత వైసీపీ ప్రభుత్వం ‘వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీ’గా నామకరణం చేసిన పేరును మార్చాలని స్థానిక ప్రజలు కోరారు. దీంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రత్యేక అధికారి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ప్రజల నుంచి వచ్చిన సూచనలను పరిశీలించిన అనంతరం, మున్సిపాలిటీకి ‘తాడిగడప’ అనే పాత పేరును పునరుద్ధరించాలని నిర్ణయించారు.
News October 18, 2025
అభివృద్ధి పనుల బిల్లులను తక్షణం చెల్లించండి: కలెక్టర్

వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి పూర్తి చేసిన పనుల బిల్లుల చెల్లింపుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ మీటింగ్ హాలులో వివిధ శాఖల అధికారులతో సమావేశమైన కలెక్టర్ బిల్లుల చెల్లింపులపై సమీక్షించారు. పూర్తి చేసిన పనులకు సకాలంలో బిల్లులు రూపొందించి Onlineలో Uplod చేయాలని, కాంట్రాక్టర్లకు తుది బిల్లు చెల్లించేంత వరకు బాధ్యత వహించాలన్నారు.
News October 17, 2025
కృష్ణా: ఉద్యోగుల నుంచి అర్జీలు స్వీకరించిన కలెక్టర్

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఎంప్లాయిస్ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించిన కలెక్టర్ పలువురు ఉద్యోగుల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించారు. ఉద్యోగులు విన్నవించిన వివిధ సమస్యలను ఆయన ఓపిగ్గా ఆలకించి పరిష్కారంపై సంబంధిత అధికారులతో మాట్లాడారు.