News January 29, 2025
విజయవాడ: అమ్మమ్మపై మనువడి దాడి

ఇంటికి లేటుగా వస్తున్నావని ప్రశ్నించినందుకు అమ్మమ్మపై మనువడు దాడి చేసి గాయపరిచాడు. కొత్తపేట పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. నైనవరం గ్రామానికి చెందిన షేక్ అమీనా (55)తన మనువడైన రసూల్ చెడు వ్యసనాలకు బానిసై తిరుగుతూ ఉన్నాడు. ఈ క్రమంలో ఇంటికి ఎందుకు లేటుగా వస్తున్నావని అమీనా ప్రశ్నించింది. ఆగ్రహానికి గురైన రసూల్ కర్రతో దాడిచేసి గాయపరిచాడు. ఈ మేరకు కొత్తపేట పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు.
Similar News
News October 22, 2025
మరో సినిమాపై కాపీరైట్ కేసు వేసిన ఇళయరాజా

లెజెండరీ మ్యూజీషియన్ ఇళయరాజా మరోసారి కాపీరైట్ ఉల్లంఘనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల విడుదలైన ‘Dude’ చిత్రంలో ‘కరుత్త మచ్చాన్’ సాంగ్‌ను అనుమతి లేకుండా ఉపయోగించారంటూ చిత్రయూనిట్‌పై ఫిర్యాదు చేశారు. దీంతో మేకర్స్, సంగీత దర్శకులు చట్టపరమైన చిక్కులను ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గుడ్ బ్యాడ్ అగ్లీ, కూలీ, మంజుమ్మల్ బాయ్స్, మిసెస్ & మిస్టర్ సినిమాలపై కాపీరైట్ కేసు వేసిన విషయం తెలిసిందే.
News October 22, 2025
ఉస్మానియా వర్సిటీలో పార్ట్‌టైమ్ లెక్చరర్ పోస్టులు

హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పీజీ సెంటర్లలో పార్ట్ టైమ్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు. పీజీ, పీహెచ్డీ లేదా నెట్/సెట్/SLET అర్హతగలవారు ఈ నెల 28లోగా ఉస్మానియా వర్సిటీ ఆర్ట్స్& సోషల్ సైన్సెస్‌లో ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సంస్కృతం, ఫిలాసఫీ పోస్టులు ఉన్నాయి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
News October 22, 2025
కొయ్యలగూడెంలో అక్టోబర్ 24న జాబ్ మేళా

కొయ్యలగూడెం ప్రకాశం డిగ్రీ కాలేజీలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సహకారంతో అక్టోబర్ 24న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి జితేంద్ర బుధవారం తెలిపారు. 13 కంపెనీల హాజరవుతాయన్నారు. 985 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లమో, డిగ్రీ, ఫార్మసీ, ఎంబీఏ, పీజీ, బీటెక్ విద్యార్హత పొందిన 18-35 ఏళ్లు ఉన్నా వారు అర్హులన్నారు.