News January 29, 2025
విజయవాడ: అమ్మమ్మపై మనువడి దాడి

ఇంటికి లేటుగా వస్తున్నావని ప్రశ్నించినందుకు అమ్మమ్మపై మనువడు దాడి చేసి గాయపరిచాడు. కొత్తపేట పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. నైనవరం గ్రామానికి చెందిన షేక్ అమీనా (55)తన మనువడైన రసూల్ చెడు వ్యసనాలకు బానిసై తిరుగుతూ ఉన్నాడు. ఈ క్రమంలో ఇంటికి ఎందుకు లేటుగా వస్తున్నావని అమీనా ప్రశ్నించింది. ఆగ్రహానికి గురైన రసూల్ కర్రతో దాడిచేసి గాయపరిచాడు. ఈ మేరకు కొత్తపేట పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు.
Similar News
News February 13, 2025
మడకశిర సీఐ రామయ్య సస్పెండ్

మడకశిర అప్ గ్రేడ్ సీఐగా పని చేస్తున్న రాగిరి రామయ్యను సస్పెండ్ చేస్తూ గురువారం ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. సీఐ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని జిల్లా ఎస్పీ రత్నకు ఇటీవల ఓ మహిళ ఫిర్యాదు చేశారు. ఎస్పీ వెంటనే విచారణకు ఆదేశించి ఆయనను వీఆర్‌కి పంపారు. మహిళ ఆరోపణలపై విచారణ జరిపిన అనంతరం సీఐని నేడు సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
News February 13, 2025
మర్రిగూడ: బైక్‌ను ఢీకొన్న మినీ వ్యాన్

మర్రిగూడ మండల పరిధిలోని రాంరెడ్డిపల్లి రహదారిపై రోడ్డుప్రమాదం జరిగింది. బైక్‌ను మినీ కూరగాయల వ్యాన్ ఢీకొట్టింది. ఈప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News February 13, 2025
బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. నెల్లూరు జిల్లాలో చెక్‌పోస్టుల ఏర్పాటు

నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ సోకకుండా చర్యలు తీసుకున్నామని పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రమేశ్ నాయక్ తెలిపారు. మనుబోలు పశు వైద్యశాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేసి మాట్లాడారు. జిల్లాలో ఆరు చోట్ల చెక్‌పోస్ట్‌ల నుంచి ఇతర జిల్లాల నుంచి కోళ్ల రవాణాను అడ్డుకుంటామన్నారు. ఉడికించిన మాంసం, గుడ్లను నిర్భయంగా తినవచ్చు అన్నారు.