News March 4, 2025

విజ‌య‌వాడ‌: ఇంట‌ర్ ప‌రీక్షా కేంద్రాల‌ను త‌నిఖీ చేసిన కలెక్టర్ 

image

విజ‌య‌వాడ‌లోని బిష‌ప్ అజ‌ర‌య్య జూనియ‌ర్ క‌ళాశాల‌, శ్రీ దుర్గామ‌ల్లేశ్వ‌ర సిద్ధార్థ మ‌హిళా క‌ళాశాలలోని ఇంట‌ర్ ప‌రీక్షా కేంద్రాల‌్లో మంగ‌ళ‌వారం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ త‌నిఖీ చేశారు. అనంతరం విద్యార్థులు ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో ప‌రీక్ష‌లు రాసేందుకు చేసిన ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు. వేస‌వి నేప‌థ్యంలో తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాల‌ని కలెక్టర్ సిబ్బందిని ఆదేశించారు. ఆయన పలువురు అధికారులు ఉన్నారు. 

Similar News

News November 14, 2025

పిల్లల ఎదుగుదలపై దృష్టి పెట్టాలి: దీపక్ తివారీ

image

పిల్లల ఎదుగుదల, ప్రవర్తనపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా అదనపు కలెక్టర్, ఇన్చార్జి విద్యాధికారి దీపక్ తివారీ అన్నారు. శుక్రవారం ఆసిఫాబాద్ కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి, బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశానికి ఆయన హాజరయ్యారు. పిల్లల ప్రవర్తన, ఎదుగుదలలో తల్లిదండ్రుల పాత్ర ముఖ్యమని తెలిపారు.

News November 14, 2025

అడిషనల్ జడ్జ్‌గా క్షమా దేశ్‌పాండే బాధ్యతలు

image

వరంగల్ జిల్లాకు SPE, ఏసీబీ(ACB) కేసుల స్పెషల్ కోర్టులో అడిషనల్ జిల్లా, సెషన్స్ జడ్జ్‌గా బాధ్యతలు చేపట్టిన క్షమా దేశ్‌పాండేను తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు డి.మురళీధర్ రెడ్డి, ప్రస్తుత అధ్యక్షుడు ఆకారం శ్రీనివాస్ కుమార్, కోశాధికారి రాజేశ్ కుమార్ తదితరులు పుష్పగుచ్ఛం అందించి అభినందించారు.

News November 14, 2025

యూఏఈపై భారత్-ఎ విజయం

image

మెన్స్ ఏషియా కప్ రైజింగ్ స్టార్స్ <<18287840>>టోర్నీలో<<>> భారత్-ఎ బోణీ కొట్టింది. UAEతో జరిగిన తొలి టీ20లో 148 రన్స్ భారీ తేడాతో ఘన విజయం సాధించింది. కొండంత లక్ష్యం(298)తో బరిలోకి దిగిన యూఏఈ 149 రన్స్‌కే పరిమితమైంది. ఆ జట్టులో సోహైబ్ ఖాన్(63) ఒక్కడే పోరాడారు. ఇండియన్ బౌలర్లలో గుర్జప్‌నీత్ 3, హర్ష్ దూబే 2 వికెట్లు తీశారు. భారత్ తన తర్వాతి మ్యాచులో పాకిస్థాన్-ఎతో ఈనెల 16న తలపడనుంది.