News November 30, 2024
విజయవాడ: ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ.. నిరాకరించడంతో సూసైడ్
ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ కథ విషాదంగా మారిన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. బుధవారం ఏలూరు కాలువలో దూకిన యువతి కోసం గవర్నర్‌పేట పోలీసులు తీవ్రంగా శ్రమించారు. ఈ సందర్భంగా సీఐ అడపా నాగమురళి మాట్లాడుతూ.. యువతి మృతదేహాన్ని శుక్రవారం రామవరప్పాడులో ఏలూరు కాలువకట్ట వద్ద గుర్తించినట్లు వెల్లడించారు. అనంతరం ఆ యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు.
Similar News
News December 7, 2024
కృష్ణా: ప్రధాని మోదీపి కలిసిన ఏలూరు ఎంపీ
నూజివీడులో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం పట్ల ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 8 కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన జాబితాలో నూజివీడుకు స్థానం కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర కేబినెట్ నిర్ణయంతో జిల్లా విద్యార్థులకు విద్యావకాశాలు అందుబాటులోకి రానున్నాయని ఎంపీ పేర్కొన్నారు.
News December 7, 2024
గన్నవరం ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్‌కు అంతరాయం.. గాల్లోనే విమానాలు
గన్నవరం విమానాశ్రయంలో శనివారం దట్టమైన పొగమంచు అలుముకుంది. దీంతో విమానాలు ల్యాండింగుకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా, హైదరాబాదు నుంచి వచ్చిన విమానం కాసేపు గాల్లోనే చక్కర్లు కొట్టగా.. ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. సుమారు గంటకుపైగా గాల్లో ఉండి, తిరిగి హైదరాబాదుకు వెళ్లినట్లు సమాచారం.
News December 7, 2024
కృష్ణా: 2 రైళ్లను రద్దు చేసిన రైల్వే అధికారులు
నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నందున విజయవాడ మీదుగా హౌరా(HWH)- తిరుచిరాపల్లి(TPJ) మధ్య ప్రయాణించే సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లను కొద్ది రోజుల పాటు రైల్వే అధికారులు రద్దు చేశారు. ఈ మేరకు నం.12663 HWH-TPJ మధ్య ప్రయాణించే రైలును ఈనెల 12,15,19న, నం.12664 TPJ-HWH రైలును ఈనెల 10,13,17న రద్దు చేశామని రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.