News July 19, 2024

విజయవాడ: ఇన్ స్ట్రా గ్రామ్‌లో ప్రేమ.. బాలిక అదృశ్యం

image

ఇన్‌స్ట్రాలో పరిచయమైన యువకుడి కోసం ఓ బాలిక(16)ఇల్లు వదిలి అదృశ్యమైన ఘటన అజిత్‌సింగ్‌నగర్ PS పరిధిలో జరిగింది. కుంటుంబ సభ్యుల వివరాలు.. బాలిక 10వ తరగతి పూర్తి చేసింది. తరచూ..ఫోన్‌లో మాట్లాడుతుండటంతో తల్లి ప్రశ్నించింది. తిరుపతికి చెందిన జాన్సన్‌ను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో తల్లి మందలించింది. ఆ రాత్రి నుంచి తమ కుమార్తె కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

Similar News

News December 3, 2025

కృష్ణా: డీసీసీ అధ్యక్షుల రేసులో అందె, శొంఠి

image

కాంగ్రెస్ పార్టీ పునః నిర్మాణంలో భాగంగా తొలుత డీసీసీ అధ్యక్షుల నియామకం చేపట్టనుంది. కృష్ణాజిల్లా డీసీసీ పదవికి ఆశావహులు పోటీపడుతున్నారు. ప్రధానంగా అవనిగడ్డకు చెందిన అందే శ్రీరామ్మూర్తి, పెడనకు చెందిన శొంఠి నాగరాజు రేసులో ముందు ఉన్నారు. డీసీసీ అధ్యక్షుల నియామకంపై ఇటీవలే జిల్లాకు పరిశీలకునిగా వచ్చిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి సంజయ్ దత్ మచిలీపట్నం వచ్చి అభిప్రాయసేకరణ చేపట్టి వెళ్లారు.

News December 3, 2025

20 కేంద్రాల్లో NMMS పరీక్ష: డీఈఓ

image

ఈనెల 7వ తేదీన జిల్లాలో నిర్వహించనున్న నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్ షిప్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేశామని డీఈఓ PVJ రామారావు తెలిపారు. జిల్లాలో మొత్తం 20 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా 4040 మంది విద్యార్థులు హాజరు కానున్నారన్నారు. మచిలీపట్నం డివిజన్‌లో 9 కేంద్రాల్లో 1838 మంది, గుడివాడ డివిజన్‌లో 6కేంద్రాల్లో 1213 మంది, ఉయ్యూరు డివిజన్‌లో 5 కేంద్రాల్లో 989 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారన్నారు.