News January 18, 2025

విజయవాడ: ఈ-లాటరీలో రిటర్నబుల్ ఫ్లాట్ల అందజేత 

image

రాజధాని అమరావతికి భూమినిచ్చిన రైతులకు శుక్రవారం విజయవాడ CRDA కార్యాలయంలో రిటర్నబుల్ ప్లాట్లు అందజేశారు. ఈ మేరకు 39 మందికి ఈ- లాటరీ విధానంలో రాజధాని అమరావతిలో 72 ఫ్లాట్లు ఇచ్చామని కార్యక్రమం నిర్వహించిన జాయింట్ కలెక్టర్ ఏ. భార్గవతేజ తెలిపారు. రిటర్నబుల్ ఫ్లాట్లు పొందిన రైతులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ సౌకర్యవంతంగా జరిగేందుకు అమరావతిలో తొమ్మిది రిజిస్ట్రేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. 

Similar News

News February 10, 2025

కృష్ణా: ‘మద్యం దుకాణాల లాటరీ వాయిదా’

image

జిల్లాలో MLC ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో సోమవారం జరగాల్సిన కల్లుగీత కార్మికుల మద్యం దుకాణాల లాటరీ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్టు కృష్ణాజిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గంగాధరరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 12 దుకాణాలను కల్లుగీత కార్మికులకు కేటాయించడం జరిగిందన్నారు. కోడ్ కారణంగా లాటరీ తీసే కార్యక్రమం వాయిదా పడిన నేపథ్యంలో తదుపరి తేదీని త్వరలో తెలియజేస్తామన్నారు.

News February 8, 2025

కృష్ణా జిల్లా: తల్లి మందలించిందని కూతురు ఆత్మహత్య

image

ఉంగుటూరు మండలం ఆత్కూరులో శుక్రవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పాఠశాలకు సరిగ్గా వెళ్లటం లేదని తల్లి మందలించడంతో 15 ఏళ్ల బాలిక మనస్తాపం చెంది యాసిడ్ తాగింది. దీంతో బాలిక తీవ్ర అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు గన్నవరం ఆసుపత్రికి, అక్కడి నుంచి విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ తెల్లవారుజామున మరణించింది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు.

News February 7, 2025

ఆత్కూరులో మైనర్ బాలిక సూసైడ్

image

ఉంగుటూరు మండలం ఆత్కూరులో శుక్రవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పాఠశాలకు సరిగ్గా వెళ్లటం లేదని తల్లి మందలించడంతో 15 ఏళ్ల బాలిక మనస్తాపం చెంది యాసిడ్ తాగింది. దీంతో బాలిక తీవ్ర అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు గన్నవరం ఆసుపత్రికి, అక్కడి నుంచి విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ తెల్లవారుజామున మరణించింది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు.

error: Content is protected !!