News August 26, 2024
విజయవాడ: ఎంపాక్స్ కోసం ప్రత్యేకంగా 6 వార్డులు
మంకీ పాక్స్ కేసులు వస్తే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టేందుకు విజయవాడలోని కొత్త ప్రభుత్వాస్పత్రిలో 6 పడకలతో అత్యాధునిక వైద్యం పరికరాలతో ప్రత్యేక వార్డ్ ఏర్పాటు చేశారు. ఆరోగ్య శాఖ ఉన్నత అధికారుల ఆదేశాలతో సూపర్ స్పెషాలిటీ బ్లాకులో వార్డును ఏర్పాటు చేసినట్లు సూపరింటెండెంట్ వెంకటేశ్ వెల్లడించారు. వదంతులను నమ్మవద్దని ఒకవేళ ఆ వ్యాధి వ్యాప్తి చెందితే తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.
Similar News
News September 14, 2024
గొల్లపూడి వరకు HYD-VJA జాతీయ రహదారి విస్తరణ
HYD- VJA జాతీయ రహదారిని గొల్లపూడి వరకు విస్తరించనున్నట్లు సంబంధిత మంత్రిత్వ శాఖ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. తొలుత దండుమల్కాపూర్(TG) నుంచి జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి వరకు విస్తరించాలని భావించినా, గొల్లపూడి వరకు 6 వరుసల రహదారి విస్తరించాలని కేంద్రం నిర్ణయించి ఈ పనులకు టెండర్లను ఆహ్వానించింది. 6 వరుసల రహదారి అందుబాటులోకి వస్తే ఎన్టీఆర్ జిల్లాలో ట్రాఫిక్ కష్టాలు తొలగిపోనున్నాయి.
News September 14, 2024
కృష్ణా: బీఈడీ పరీక్షల షెడ్యూల్ విడుదల
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో బీఈడీ 2వ సెమిస్టర్(రెగ్యులర్ & సప్లిమెంటరీ) విద్యార్థులు రాయాల్సిన థియరీ పరీక్షలను అక్టోబర్ 21 నుంచి నిర్వహిస్తామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు సెప్టెంబర్ 25 లోపు అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించాలని, పూర్తి వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని పరీక్షల విభాగం తెలిపింది.
News September 14, 2024
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్
ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా చెన్నై ఎగ్మోర్(MS), సత్రాగచ్చి(SRC) మధ్య స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 21 నుంచి నవంబర్ 31 వరకు ప్రతి శనివారం MS- SRC(నం.06077), ఈ నెల 23 నుంచి డిసెంబర్ 2 వరకు ప్రతి సోమవారం SRC- MS(నం.06078) ట్రైన్లు నడుపుతున్నామన్నారు. కాగా ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు ఏపీలో పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.