News August 8, 2024

విజయవాడ: ఎమ్మెల్యే సుజనా చౌదరితో వైసీపీ కార్పొరేటర్లు భేటీ

image

విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి పలువురు వైసీపీ కార్పొరేటర్లు గురువారం ఎమ్మెల్యే సుజనా చౌదరిని కలిశారు. కార్పొరేటర్లు రాజేశ్, మహదేవ్ అప్పాజీ, అర్షద్, నరేంద్ర, రత్నకుమారి, లావణ్య, ఆదిలక్ష్మి ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ.. విజయవాడ వైసీపీ అగ్రనాయకత్వం తమను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

Similar News

News December 15, 2025

ధాన్యం సేకరణకు మిల్లర్లు సహకరించాలి: కలెక్టర్

image

రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం సేకరణకు మిల్లర్లు సహకరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మిల్లర్లను కోరారు. సోమవారం కలెక్టరేట్‌లో ధాన్యం సేకరణపై రైస్ మిల్లర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో ఈ సంవత్సరం 149 కంబైన్డ్ హార్వెస్టర్ల ద్వారా రైతులు కోతలు కోయడం వల్ల గోనె సంచులు, వాహనాల కొరత ఏర్పడిందని, మిల్లర్లు తమవంతుగా గోనె సంచులు, వాహనాలు సమకూర్చాలన్నారు.

News December 15, 2025

BREAKING చల్లపల్లిలో కారు బీభత్సం.. వ్యక్తి మృతి

image

చల్లపల్లిలో కారు బీభత్సం సృష్టించింది. స్థానికుల వివరాల మేరకు.. పోలీస్ స్టేషన్ బజార్లో కారు అదుపు తప్పి జనం మీదకి కారు దూసుకెళ్లింది. రోడ్డుపై ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టగా, వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురుకి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఓ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

News December 15, 2025

MTM: కొట్లాడుకున్నారు.. కలిసి విగ్రహాలు పెడుతున్నారు.!

image

మచిలీపట్నం నియోజకవర్గ కూటమిలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. వారం రోజుల క్రితం తమ పార్టీ ముఖ్య నేతల విగ్రహాల ప్రతిష్ఠ విషయంలో రోడ్డెక్కి రచ్చ చేసిన TDP, BJP నేతలు నేడు ఒకటైపోయారు. హౌసింగ్ బోర్డ్ రింగ్‌లో వాజ్ పేయి విగ్రహం పెడతామని, కాదు NTR విగ్రహం పెడతామని ఆందోళనకు దిగిన ఇరు పార్టీల వాళ్లు పార్టీ పెద్దల ఆదేశాలతో అదే సెంటర్‌లో ఈ నెల 16న ఇద్దరి మహనీయుల విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు సిద్ధమయ్యారు.