News December 29, 2024

విజయవాడ: ఏలూరు – తాడేపల్లిగూడెం వెళ్లే రైలు ప్రయాణికులకు అలర్ట్

image

గన్నవరం – ముస్తాబాద మధ్య ట్రాక్ పనులు జరుగుతున్నందున రైలు నం.13351 ధన్‌బాద్ – అలప్పుజ ఎక్స్‌ప్రెస్‌ రైలు మార్గాన్ని మార్చినట్లు రైల్వే అధికారులు శనివారం తెలిపారు. ఈ ట్రైన్‌ ఈ నెల 30, 31, జనవరి 2, 3, 4 తేదీలలో ఏలూరు, తాడేపల్లిగూడెం మీదుగా గాక విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్ గుండా నిడదవోలు చేరుతుందన్నారు. ఆయా తేదీలలో ఈ ట్రైన్‌కు ఏలూరు, తాడేపల్లిగూడెంలో స్టాప్ లేదని, ప్రయాణికులు గమనించాలని సూచించారు.

Similar News

News January 6, 2025

నేడు తాడేపల్లి చేరుకోనున్న మాజీ సీఎం జగన్ 

image

బెంగుళూరు వెళ్లిన మాజీ సీఎం జగన్ సోమవారం తిరిగి రాష్ట్రానికి రానున్నారు. సాయంత్రం 5.20కి ఆయన బెంగుళూరు నుంచి గన్నవరం చేరుకుంటారని ఆయన కార్యాలయ సిబ్బంది తెలిపారు. సాయంత్రం 5.30కి గన్నవరంలో రోడ్డు మార్గాన బయలుదేరి 6 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి మాజీ సీఎం జగన్ చేరుకుంటారని ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేశారు. 

News January 6, 2025

సంక్రాంతికి ఊరెళుతున్నారా.. ఇది మీకోసమే.!

image

కైకలూరు, గుడివాడ, విజయవాడ మీదుగా సంక్రాంతి సందర్భంగా చర్లపల్లి(CHZ)- కాకినాడ టౌన్(CCT) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు. నం.07031 CHZ-CCT రైలు ఈనెల 8,10,12,14న, నం.07032 CCT-CHZ రైలు ఈనెల 9,11,13,15న నడుపుతామన్నారు. ఈ రైళ్లు చర్లపల్లిలో పై తేదీలలో రాత్రి 9.45కి బయలుదేరి తరవాతి రోజు ఉదయం 8.30కి కాకినాడ టౌన్ చేరుకుంటాయన్నారు. 

News January 6, 2025

ఏపీని అగ్రగామిగా నిలపడమే చంద్రబాబు సంకల్పం: ఉమా

image

ఏపీని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపడమే సీఎం చంద్రబాబు సంకల్పం అని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆదివారం ట్వీట్ చేశారు. విశాఖను ఆర్థిక రాజధానిగా, అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా, రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా సీఎం ప్రణాళిక సిద్ధం చేశారన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ నినాదంతో రాష్ట్రంలోని ప్రతి ప్రాంతాన్ని కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని Xలో పేర్కొన్నారు.