News December 29, 2024

విజయవాడ: ఏలూరు – తాడేపల్లిగూడెం వెళ్లే రైలు ప్రయాణికులకు అలర్ట్

image

గన్నవరం – ముస్తాబాద మధ్య ట్రాక్ పనులు జరుగుతున్నందున రైలు నం.13351 ధన్‌బాద్ – అలప్పుజ ఎక్స్‌ప్రెస్‌ రైలు మార్గాన్ని మార్చినట్లు రైల్వే అధికారులు శనివారం తెలిపారు. ఈ ట్రైన్‌ ఈ నెల 30, 31, జనవరి 2, 3, 4 తేదీలలో ఏలూరు, తాడేపల్లిగూడెం మీదుగా గాక విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్ గుండా నిడదవోలు చేరుతుందన్నారు. ఆయా తేదీలలో ఈ ట్రైన్‌కు ఏలూరు, తాడేపల్లిగూడెంలో స్టాప్ లేదని, ప్రయాణికులు గమనించాలని సూచించారు.

Similar News

News January 24, 2025

విజయవాడలో విదేశీ సిగరెట్లు స్వాధీనం

image

రామవరపాడులో గుట్టు చప్పుడు కాకుండా నిలువచేస్తున్న విదేశీ సిగరెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ కస్టమ్స్ కమిషనరేట్, గుంటూరు జీఎస్టీ అధికారుల వివరాల మేరకు.. రామవరపాడులో విదేశీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆ సిగరెట్ బాక్స్‌పై ఎటువంటి నియమ నిబంధనలు లేవని చెప్పారు. వాటి విలువ సుమారు రూ.1.76కోట్లు ఉంటుందన్నారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా 2 వారాలు రిమాండ్ విధించారు. 

News January 24, 2025

కృష్ణా: బీపీఈడీ&డీపీఈడీ పరీక్షల టైం టేబుల్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలోని కాలేజీలలో బీపీఈడీ&డీపీఈడీ కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్ థియరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఫిబ్రవరి 10, 11,12,13 తేదీలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టు వారీగా టైం టేబుల్ వివరాలకై https://kru.ac.in/ వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది. 

News January 24, 2025

కృష్ణా: హోంగార్డులకు స్టడీ మెటీరియల్ అందించిన ఎస్పీ 

image

కృష్ణా జిల్లా పోలీసు కార్యాలయంలోని మోటార్ ట్రాన్స్‌పోర్ట్ సెక్షన్‌లో విధులు నిర్వహిస్తున్న ఏడుగురు హోంగార్డులు ఇటీవల జరిగిన కానిస్టేబుల్ ఎంపికలో భాగంగా ఫిజికల్ టెస్టులు పాసయ్యారు. ఈ నేపథ్యంలో ఎస్పీ గంగాధర్ గురువారం వారిని మచిలీపట్నంలోని తన కార్యాలయంలో అభినందించారు. అనంతరం వారందరికీ మెయిన్స్ పరీక్షకు కావలసిన స్టడీ మెటీరియల్ పుస్తకాలను ఆయన అందజేశారు.