News July 11, 2024
విజయవాడ కనకదుర్గమ్మ హుండీలో 1300 US డాలర్లు

దుర్గామల్లేశ్వర స్వామి హుండీ ఆదాయ లెక్కింపు కార్యక్రమం జరిగింది. 20 రోజులకుగానూ రూ.3,36,59,796 నగదు, 436 గ్రా. బంగారం, 6.06 కిలోల వెండి వచ్చిందని అధికారులు చెప్పారు. 1300 US డాలర్లు, 85 UK పౌండ్లు, 7 ఆస్ట్రేలియా డాలర్లు, 12 సింగపూర్ డాలర్లు, 80 కెనడా డాలర్లు, 70 న్యూజిలాండ్ డాలర్లు, 625 కువైట్ దీనార్లు, 118 మలేషియా రింగెట్స్, ఈ-హుండీ ద్వారా రూ.1,91,787 ఆదాయం వచ్చిందన్నారు.
Similar News
News November 15, 2025
వీధుల పాలైన బాల్యం.. కూటి కోసం భుజాలపై చెత్త భారం.!

పుస్తకాల సంచితో బడికి వెళ్లాల్సిన బాల్యం నేడు వీధుల పాలైంది. గుంటూరు నగర వీధుల్లో శనివారం కనిపించిన దృశ్యం చూపరుల హృదయాలను ద్రవింపజేసింది. ఎండను సైతం లెక్కచేయకుండా, పసి వయసులోనే కొందరు చిన్నారులు ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరుకుంటూ జీవన పోరాటం సాగిస్తున్నారు. బాలల హక్కుల గురించి ఎన్ని చట్టాలు ఉన్నా, పట్టపగలే నగరంలో ఇలాంటి బాలకార్మిక దృశ్యాలు కనిపించడం ఆవేదన కలిగిస్తోందని స్థానికులు అభిప్రాయపడ్డారు.
News November 15, 2025
GNT: నేడు ఘట్టమనేని శివరామకృష్ణ వర్ధంతి

గుంటూరు (D) బుర్రిపాలెం గ్రామంలో 1943 మే 31న, ఘట్టమనేని శివరామకృష్ణ జన్మించారు.1965 తేనె మనసులు సినిమాతో ఆయన తెలుగు సినీ రంగంలో అడుగుపెట్టారు. తేనె మనసులు హిట్ అవడంతో, అప్పటి అగ్ర హీరోలతో పోటీపడి సూపర్ స్టార్‌గా ఎదిగారు. గూఢచారి 116, మోసగాళ్లకు మోసగాడు, అల్లూరి సీతారామరాజు, సింహాసనం, ఇలా ఎన్నో హిట్ సినిమాలతో 350పై చిలుకు సినిమాలు చేసి అగ్ర హీరోల సరసన నిలిచారు. 15 నవంబర్ 2022న తుది శ్వాస విడిచారు.
News November 15, 2025
గుంటూరు మిర్చీ యార్డులో 40,026 టిక్కీలు అమ్మకం

గుంటూరు మిర్చి యార్డుకు శుక్రవారం 34,160 మిర్చి టిక్కీలు విక్రయానికి వచ్చాయని గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నతశ్రేణి కార్యదర్శి చంద్రిక తెలిపారు. ముందురోజు నిల్వ ఉన్న వాటితో కలిపి 40,026 అమ్మకం జరిగాయని ఇంకా యార్డు ఆవరణలో 7,698 మిర్చి టిక్కీలు నిల్వ ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. వివిధ రకాల మిరపకాయలకు ధరలు పలు విధాలుగా నమోదయ్యాయన్నారు.


