News July 4, 2024

విజయవాడ: కవలలు సహా.. తల్లి మృతి

image

విజయవాడ రూరల్ పడమటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో బుధవారం తెల్లవారుజామున కవల పిల్లలు మృతి చెందారు. <<13556286>>తల్లి పరిస్థితి కూడా విషమంగా ఉండగా కొద్దిసేపటికి ఆమే కన్నుమూశారు.<<>> వివరాల్లోకి వెళితే.. గంగూరు సచివాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ప్రశాంత్ సతీమణి మాధవి, ప్రైవేటు ఆసుపత్రిలో కవల పిల్లలకు జన్మనిచ్చింది. అయితే వైద్యుల నిర్లక్ష్యం వల్ల కవలలు ఆ తర్వాత తల్లి కూడా మృతి చెందినట్లు మాధవి బంధువులు ఆరోపిస్తున్నారు.

Similar News

News February 23, 2026

కృష్ణా: ఇంటర్మీడియట్ పరీక్షలు మరికాసేపట్లో ప్రారంభం

image

జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఈ సారి ఫస్ట్ ఇయర్‌కు 24,173 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. జిల్లా వ్యాప్తంగా 63 పరీక్షా కేంద్రాల్లో ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. భద్రత, పర్యవేక్షణ కోసం 900 మంది ఇన్విజిలేటర్లు, మూడు సిట్టింగ్ స్క్వాడ్లు, మూడు ఫ్లయింగ్ స్క్వాడ్లు విధుల్లో ఉండనున్నాయి. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కానుంది.

News February 23, 2026

నేడు మచిలీపట్నంలో ‘మీకోసం’

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘మీకోసం’ కార్యక్రమం మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10:30 గంటలకు నిర్వహించనున్నారు. ఈ మేరకు కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ప్రకటన విడుదల చేశారు. జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమంలో పాల్గొని సంబంధిత అధికారులకు అర్జీలు అందించి, పరిష్కారం పొందాలని సూచించారు.