News January 5, 2025
విజయవాడ: కీలక పదవి రేసులో ఎమ్మెల్యే సుజనా

రాష్ట్ర BJP అధ్యక్ష పదవి రేసులో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా పేరు కీలకంగా వినిపిస్తోంది. ప్రస్తుత అధ్యక్షురాలు పురంధీశ్వరికి కేంద్ర క్యాబినెట్లో చోటు దక్కే అవకాశం ఉన్నందున సంక్రాంతి అనంతరం బీజేపీకి కొత్త అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. కాగా బీజేపీ అధ్యక్ష పదవి రేసులో సుజానాతో పాటు MLC పీవీఎన్ మాధవ్, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, పురిగళ్ల రఘురాం పేర్లు వినిపిస్తున్నాయి.
Similar News
News October 13, 2025
MTM: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలు స్వీకరించిన కలెక్టర్

కలెక్టర్ డీ.కే. బాలాజీ నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక-మీకోసం” కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్, డీఆర్ఓ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొని వివిధ శాఖలకు సంబంధించిన సమస్యలను పరిశీలించారు. ప్రజల సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
News October 13, 2025
షాపింగ్ ఉత్సవ్ ఏర్పాట్లు పూర్తి చేయాలి: జేసీ

మచిలీపట్నంలోని జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో ఈ నెల 13న ప్రారంభం కానున్న షాపింగ్ ఉత్సవ్ ఏర్పాట్లను వేగంగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ నవీన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా ఏర్పాట్లను ఆదివారం ఆయన సమీక్షించారు. ఉత్సవ్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు తక్షణమే పూర్తిచేయాలని సూచించారు.
News October 12, 2025
గన్నవరం జాతీయ రహదారిపై ప్రమాదం.. ఒకరి మృతి

గన్నవరం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్న ఘటనలో ఆదివారం ఒకరు మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. సైకిల్ పై రోడ్డు దాటుతున్న వ్యక్తిని వేగంగా లారీ ఢీకొట్టింది. లారీ చక్రాలు మృతిని పై నుంచి వెళ్లడంతో అతను ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మృతుడు గన్నవరంలో ముఠా పని చేస్తుంటాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.