News March 11, 2025
విజయవాడ కోర్టులో పోసానికి బెయిల్

రాజంపేట, నరసరావుపేట కోర్టులో పోసాని కృష్ణమురళికి ఇప్పటికే బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విజయవాడ కోర్టులో మంగళవారం పోసానికి బెయిల్ మంజూరు అయింది. మిగతా కేసుల్లో బీఎన్ఎస్ చట్టం 353 సెక్షన్ కింద నోటీసులు హైకోర్టు ఇవ్వాలని ఆదేశించింది. ప్రస్తుతం కర్నూల్ జైల్లో పోసాని ఉన్నారు. అన్ని కేసుల్లో రిలీఫ్ కావడంతో రేపు విడుదల అయ్యే అవకాశం ఉంది.
Similar News
News November 20, 2025
తిరుమల: వేగంగా ఫుడ్ ల్యాబ్ పనులు

భక్తులకు నాణ్యమైన ఆహారం అందించే దిశగా తిరుమలలో స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.19.84 కోట్లు విడుదల చేసింది. ల్యాబ్ యంత్రాలు ఇప్పటికే తిరుమలకు చేరుకున్నాయి. ఇందుకు సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. డిసెంబర్ నెలలో ల్యాబ్ ప్రారంభించేలా పనులు చేస్తున్నారు.
News November 20, 2025
దేవ్జీ, రాజిరెడ్డి మా వద్ద లేరు.. HCకి తెలిపిన పోలీసులు

AP: టాప్ మావోలు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, మల్లా రాజిరెడ్డిని కోర్టులో హాజరుపర్చేలా ఆదేశించాలన్న పిటిషన్లపై పోలీసులు HCలో వివరణ ఇచ్చారు. వారిద్దరూ తమ వద్ద లేరన్నారు. దీంతో వారు పోలీసుల వద్ద ఉన్నారనేందుకు ఆధారాలు చూపాలని పిటిషనర్లను HC ఆదేశించింది. మావో కీలక నేతలు తమ అధీనంలో ఉన్నారన్న పోలీసుల ప్రెస్ స్టేట్మెంట్ను సమర్పిస్తామని పిటిషనర్లు చెప్పడంతో విచారణను HC రేపటికి వాయిదా వేసింది.
News November 20, 2025
నార్సింగి: పల్లె ప్రకృతి వనమా.. డంపింగ్ యార్డా?

పచ్చని చెట్లు పెంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసింది. కానీ నార్సింగి మం. సంకాపూర్ పల్లె ప్రకృతి వనంలో పూర్తిగా చెత్త వేస్తూ అధ్వానంగా మారుస్తున్నారు. ప్రకృతి వనం ప్రక్కనే నివాస గృహాలు ఉండడంతో చెత్త వల్ల పాములు విపరీతంగా వస్తున్నాయని, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు గ్రామస్థులు కోరుతున్నారు.


