News June 11, 2024
విజయవాడ: గవర్నర్ను కలిసిన కూటమి నేతలు

ఆంధ్రప్రదేశ్ శాసనసభ పక్ష నేతగా చంద్రబాబుని ఏకగ్రీవంగా ఎన్నుకున్న తీర్మాన పత్రాన్ని మంగళవారం కూటమి నేతలు గవర్నర్కు అందజేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి, జనసేన నేత నాదెండ్ల మనోహర్లు కలిసి విజయవాడలోని రాజ్ భవన్లో గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలిశారు.
Similar News
News November 18, 2025
కృష్ణా: క్లెయిమ్ కాని ఖాతాల్లో రూ.113 కోట్ల నిల్వలు

కృష్ణా జిల్లాలో ‘మీ డబ్బు-మీ హక్కు’ పేరుతో క్లెయిమ్ కాని డిపాజిట్లపై అవగాహన కల్పించే పోస్టర్లను కలెక్టర్ డి.కె. బాలాజీ ఆవిష్కరించారు. జిల్లాలో మొత్తం 5.59 లక్షల క్లెయిమ్ కాని ఖాతాల్లో రూ.113 కోట్లు నిలిచిపోయాయని తెలిపారు. ఈ సొమ్మును సరైన డిపాజిటర్లకు లేదా వారి చట్టపరమైన వారసులకు తిరిగి అందించాలనే లక్ష్యంతో ఈ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

News November 17, 2025
వరకట్న వేధింపులు, మరణాలు అడ్డుకోవాలి: కలెక్టర్

వరకట్నం వల్ల జరిగే గృహహింస, వేధింపులు, మరణాలను నివారించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ అధ్యక్షతన తన ఛాంబర్లో వరకట్న నిషేధ చట్టం-1961 జిల్లా సలహా మండలి కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. వరకట్న నిషేధ చట్టం అమలుకు జిల్లా వరకట్న నిషేధ అధికారులు కీలక పాత్ర పోషించాలన్నారు.