News October 3, 2024
విజయవాడ, గుంటూరు మీదుగా తిరుపతికి APSRTC ఏసీ బస్సు

ప్రయాణికుల సౌకర్యార్థం విజయవాడ, గుంటూరు మీదుగా తిరుపతికి ఇంద్ర AC బస్సు నడుపుతున్నట్లు ఆర్టీసీ ఆధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతిరోజు అర్థరాత్రి ఒంటి గంటకు విజయవాడ చేరుకునే ఈ బస్సు (సర్వీస్ నం.47745) ఉదయం 8.45 గంటలకు తిరుపతి చేరుకుంటుందని, ప్రయాణికులు ఈ సర్వీసును ఆదరించాలని ఆర్టీసీ అధికారులు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.
Similar News
News October 16, 2025
భాగస్వామ్య సదస్సుపై జిల్లాలో అవగాహన: కలెక్టర్

విశాఖపట్నంలో నవంబర్ 14, 15 తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సు (ఇండస్ట్రీ పార్ట్నర్షిప్ డ్రైవ్) పోస్టర్ను కలెక్టర్ తమీమ్ అన్సారియా బుధవారం విడుదల చేశారు. ఈ నెల 15 నుంచి నవంబర్ 15 వరకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సదస్సులో జిల్లా నుంచి ఎక్కువ మంది భాగస్వామ్యం అయ్యేలా కృషి చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు.
News October 15, 2025
మంగళగిరి: పోలీస్ అమరవీరుల దినోత్సవ ఏర్పాట్లు పరిశీలన

దేశవ్యాప్తంగా అక్టోబర్ 21న నిర్వహించబోతున్న పోలీసు అమరవీరుల దినోత్సవ ఏర్పాట్లను మంగళగిరి ఏపీఎస్పీ 6 బెటాలియన్లో ఎస్పీ వకుల్ జిందాల్ బుధవారం పరిశీలించారు. భద్రత, అమరవీరుల స్తూపం, స్టేజి నిర్మాణం, పరేడ్ స్థలాలను బెటాలియన్ ఇన్ఛార్జ్ కమాండెంట్ ఏ.మురళీ ఎస్పీకి వివరించారు. సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలన్నారు.
News October 15, 2025
తెనాలిలో పెరుగుతున్న క్రైమ్ రేటు!(1/2)

ప్రశాంతంగా ఉంటున్న తెనాలిలో పరిస్థితి 3 మర్డర్లు..6 చోరీలు అన్నట్లుగా మారిందన్న విమర్శలు వస్తున్నాయి. గత 7 నెలల కాలంలో వేర్వేరు కారణాలతో ఏడుగురు హతమయ్యారు. చెంచుపేటలో ఇవాళ జరిగిన హత్య లాగానే కొన్ని నెలల క్రితం పండ్ల వ్యాపారిని దారుణంగా కత్తితో నరికి హత్య చేశారు. తర్వాత ముత్తింశెట్టిపాలెంలో మహిళ హత్య, పరిమి రోడ్డులో డబుల్ మర్డర్, పినపాడులో ఒకటి, వార్ఫ్ రోడ్డులో ఇంకో హత్య జరిగాయి.