News October 29, 2024
విజయవాడ: చిన్నారి గీసిన చిత్రానికి సీఎం చంద్రబాబు ఫిదా

విజయవాడకు చెందిన 8వ తరగతి విద్యార్థిని లాస్య గీసిన చంద్రబాబు రేఖాచిత్రాన్ని తీసుకొని సోమవారం అమరావతి సచివాలయానికి వచ్చింది. ‘సంపద సృష్టించి పేదవారికి పంచి ఇచ్చే పెన్నిధికి ఒక పేద విద్యార్థి ఇచ్చే చిరుజ్ఞాపిక’ అంటూ చంద్రబాబు గురించి గీసిన ఆ చిత్రాన్ని చూసి సీఎం ఫిదా అయ్యారు. అనంతరం లాస్యను అభినందించారు. బాగా చదువుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని ఆయన ఆకాంక్షించారు.
Similar News
News October 23, 2025
కృష్ణా: వర్షంతో రోడ్లు అస్తవ్యస్తం

అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో కురుస్తున్న వర్షాలకు పట్టణం, పరిసర గ్రామాల్లో రహదారులు అస్తవ్యస్తంగా మారాయి. రోడ్లు నీట మునగడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో పారిశుధ్య పరిస్థితులు దారుణంగా మారి, వర్షపునీరు, మురుగు కలసి కాలువల నుండి బయటకు పొంగి దుర్వాసన వ్యాపిస్తోంది. అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
News October 23, 2025
కృష్ణా: నేడు జిమ్నాస్టిక్స్ జట్ల ఎంపిక

కృష్ణా జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య (ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో అండర్-14, 17 బాల బాలికల జిమ్నాస్టిక్స్ జట్ల ఎంపికలు నేడు జరగనున్నాయి. విజయవాడలోని సిద్దార్థ పాఠశాల ఇండోర్ స్టేడియంలో సాయంత్రం 3 గంటలకు ఎంపికలు మొదలవుతాయి. క్రీడాకారులు స్టడీ సర్టిఫికేట్, జనన ధృవీకరణ పత్రం, హెచ్‌ఎం సంతకం, సీల్‌తో ఉన్న ఎంట్రీ ఫారం తప్పనిసరిగా తీసుకురావాలని కార్యదర్శి దుర్గారావు తెలిపారు.
News October 22, 2025
రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి – కలెక్టర్

జిల్లాలో నెలకొన్న పలు రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్లో రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా గ్రామాలలో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాలలో రెండు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తున్న నేపథ్యంలో అర్హత గల లబ్ధిదారులను గుర్తించాలన్నారు.


