News November 11, 2024
విజయవాడ: జనసేనలో చేరిన YCP కార్పొరేటర్లు
విజయవాడకు చెందిన నలుగురు వైసీపీ కార్పొరేటర్లు సోమవారం జనసేన పార్టీలో చేరారు. ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయభాను నేతృత్వంలో కార్పొరేటర్లు మహాదేవ్ అప్పాజీ, ఉమ్మడిశెట్టి బహుదూర్, ఆదిలక్ష్మి, రాజేశ్‌లు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. విజయవాడలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వారికి పవన్ సూచించారు.
Similar News
News December 6, 2024
కృష్ణా: MBA పరీక్షల టైం టేబుల్ విడుదల
కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలో MBA కోర్సు చదువుతున్న విద్యార్థులు రాయాల్సిన 1,3వ సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. 1వ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 28 నుంచి 2025 జనవరి 7 వరకు మధ్యాహ్నం 2- సాయంత్రం 5 గంటల వరకు, 3వ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 28 నుంచి 2025 జనవరి 9 వరకు ఉదయం 10- మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్ణీత తేదీలలో జరుగుతాయని KRU తెలిపింది. పూర్తి వివరాలకు https://kru.ac.in/ వెబ్‌సైట్ చూడవచ్చు.
News December 6, 2024
అంబేడ్కర్ అడుగుజాడల్లో ప్రయాణిద్దాం: లక్ష్మీశ
అంబేడ్కర్ అడుగుజాడల్లో పయనిస్తూ దేశాభివృద్ధికి కృషిచేద్దామని శుక్రవారం కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. బి.ఆర్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంరతం కలెక్టర్ మాట్లాడుతూ.. అంబేడ్కర్ దేశానికి అందించిన సేవలను కొనియాడారు.
News December 6, 2024
విజయవాడకు సీఎం రాక.. ఏర్పాట్ల పరిశీలన
విజయవాడ శివారు పోరంకిలో రేపు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఎస్పీ గంగాధర్ రావు, కలెక్టర్ డీకే బాలాజీ శుక్రవారం సీఎం పర్యటన ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. పోరంకిలోని ‘మురళీ రిసార్ట్స్’లో జరిగే ఊర్జావీర్’కు హాజరుకానున్నారు. సీఎం రాక సందర్భంగా ట్రాఫిక్‌కు ఎటువంటి అంతరాయం లేకుండా చూడాలని వారు అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. అనంతరం ఫంక్షన్ హాల్‌లోని తనిఖీలు చేసినట్లు వెల్లడించారు.