News December 18, 2024
విజయవాడ: ‘జమిలీ ఎన్నికలను వ్యతిరేఖిస్తున్నాం’
జమిలీ ఎన్నికలకు సిపిఐ పార్టీ వ్యతిరేకమని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి రాజా అన్నారు. మంగళవారం విజయవాడలో సీపీఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో ఏపీ ప్రభుత్వానికి, అదానికి మధ్య అవినీతి జరిగిందని ఈ ఘటనలో అదానిని కేంద్ర ప్రభుత్వం అరెస్టు చేయడానికి ఎందుకు వెనుకడుగు వేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదాని ఘటనపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్పందించాలన్నారు. పలువురు నాయకులు పాల్గొన్నారు.
Similar News
News January 19, 2025
విజయవాడ: దేవాలయాలపై చట్ట సవరణ చేయాలని వినతి
ఇటీవల విజయవాడ సమీపంలో హైందవ శంఖారావం కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే. నేడు ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను VHP కేంద్రీయ ఉపాధ్యక్షుడు గంగరాజు, రాష్ట్ర కార్యదర్శి రవికుమార్, రాష్ట్ర కోశాధికారి దుర్గాప్రసాద్ రాజు విజయవాడలో కలిశారు. ఇటీవల నిర్వహించిన హైందవ శంఖారావ సభ వివరాలను అమిత్ షాకు అందించారు. కేంద్ర ప్రభుత్వం దేవాలయాల స్వయం ప్రతిపత్తి కొరకు చట్ట సవరణ చేయాలని కోరారు.
News January 19, 2025
అమిత్‌షా పర్యటనకు సర్వం సిద్ధం: మంత్రి కొలుసు
కేంద్రమంత్రి అమిత్‌షా గన్నవరం పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. కొండపావులూరులోని NIDM, NDRF భవనాల వద్ద ఈ మేరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు సిద్ధం చేశామని కొలుసు చెప్పారు. బహిరంగ సభ జరిగే పరిసర ప్రాంతాలు, నూతనంగా నిర్మాణం పూర్తి చేసుకున్న భవనాల వద్ద పోలీసు అధికారులతో కలసి ఏర్పాట్లు పర్యవేక్షించామని మంత్రి కొలుసు పేర్కొన్నారు.
News January 19, 2025
విజయవాడ: వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వరికూటి
వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వరికూటి అశోక్ బాబును నియమిస్తూ శనివారం తాడేపల్లిలోని ఆ పార్టీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా 2024 ఎన్నికలలో బాపట్ల జిల్లా వేమూరు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అశోక్.. టీడీపీ అభ్యర్థి నక్కా ఆనంద్ చేతిలో పరాజయం పొందారు. కాగా అశోక్ నియామకంతో పాటు మరో 5 నియోజకవర్గాలకు నూతన సమన్వయకర్తలను వైసీపీ నియమించింది.