News January 26, 2025
విజయవాడ: జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీపీ

76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సీపీ రాజశేఖర్ బాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించారు. పోలీస్ బ్యాండ్ వారు లయబద్ధంగా జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం సీపీ ప్రజలకు పోలీస్ సిబ్బందికి 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News December 3, 2025
అభ్యంతరాల పరిష్కారం తర్వాతే బైపాస్ భూ సేకరణ: కలెక్టర్

PDPL బైపాస్ రోడ్డు నిర్మాణానికి జరుగుతున్న భూ సేకరణ ప్రక్రియలో రైతుల అభ్యంతరాలను పూర్తిగా పరిష్కరించిన తర్వాతే తదుపరి చర్యలు చేపడతామని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. అప్పన్నపేటలో జరుగుతున్న సర్వేను ఆయన బుధవారం పరిశీలించారు. పట్టణ అభివృద్ధిలో భాగంగా బైపాస్ రోడ్డు మంజూరు చేయడంతో మెరుగైన పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. RDO గంగయ్య, ఆర్&బీ ఈఈ భావ్ సింగ్ తదితరులు ఉన్నారు.
News December 3, 2025
టాటా ట్రస్ట్ ఎలక్షన్ ఫండ్స్.. 83 శాతం బీజేపీకే

2024-25 లోక్సభ ఎలక్షన్ ఇయర్లో టాటా గ్రూప్ అనుబంధ ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి BJPకి రూ.757 కోట్ల ఫండ్స్ అందాయి. ట్రస్ట్ అందించిన మొత్తం నిధుల్లో ఇది 83% కాగా 8.4% వాటాతో కాంగ్రెస్ రూ.77.3 కోట్లు అందుకుంది. ఈసీకి అందించిన వివరాల ప్రకారం.. లోక్సభ ఎన్నికల సమయంలో BJP, కాంగ్రెస్ సహా 10 రాజకీయ పార్టీలకు రూ.914 కోట్ల నిధులొచ్చాయి. YCP, BRS తదితర పార్టీలకు చెరో రూ.10 కోట్లు ఇచ్చింది.
News December 3, 2025
ఖమ్మం జిల్లాలో 6 బయో-ఇన్పుట్ సెంటర్లు

రాష్ట్రంలో సేంద్రీయ సాగు ప్రోత్సాహకానికి 250 బయో-ఇన్పుట్ రిసోర్స్ సెంటర్లను గుర్తించినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ తెలిపారు. లోక్సభ సమావేశాల్లో ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. జిల్లాలో ఇటువంటి కేంద్రాలు ఆరు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ఈ కేంద్రాల ద్వారా రైతులకుబీజామృత్, జీవామృత్, నీమాస్త్రం వంటి సేంద్రీయ ఎరువులను అందిస్తున్నట్లు వెల్లడించారు.


