News May 4, 2024

విజయవాడ: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటుపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో స్కూటీపై వెళుతున్న  విజయవాడకు చెందిన ప్రసాద్(70)ను కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ప్రసాద్ తీవ్రంగా గాయపడగా గమనించిని స్థానికులు వెంటనే అతనిని విజయవాడ ప్రైవేట్ హాస్పటల్‌కు తరలిచారు.. చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.  

Similar News

News December 24, 2025

గన్నవరంలో ఈనెల 27న మెగా జాబ్ మేళా

image

గన్నవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 27న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరిగే ఈ మేళాలో పలు కంపెనీలు పాల్గొంటాయని చెప్పారు. టెన్త్ నుంచి డిగ్రీ వరకు 18-35 ఏళ్ల యువత అర్హులని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 9676708041, 9494005725 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.

News December 24, 2025

గుడివాడలో విచ్చలవిడిగా మెడికల్ షాపులు..!

image

గుడివాడలో విచ్చలవిడిగా మెడికల్ షాపులు పెరిగిపోతున్నాయని ప్రజలు అంటున్నారు. డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని షాపుల్లో డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా మందులు ఇస్తున్నారని, అనుభవం లేని అర్హత లేని వ్యక్తులు విక్రయిస్తున్నారని చెబుతున్నారు. రోజువారీ పనులు చేసుకొనే వారికి యాంటీబయోటిక్ మందులను విక్రయిస్తున్నారంటున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

News December 24, 2025

నేటి నుంచి గుడివాడలో రాష్ట్ర స్థాయి పోటీలు

image

గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో బుధవారం ఖో.. ఖో, బ్యాట్మెంటన్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీలను శాప్ ఛైర్మన్ రవి నాయుడు ప్రారంభించనున్నారు. 58వ రాష్ట్రస్థాయి ఖో.. ఖో సీనియర్ చాంపియన్షిప్ పోటీలు, సాయంత్రం నిర్వహించే 87వ జాతీయస్థాయి సీనియర్ బ్యాట్మెంటన్ చాంపియన్‌షిప్ పోటీలను ఆయన ప్రారంభించనున్నట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు.