News May 4, 2024

విజయవాడ: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటుపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో స్కూటీపై వెళుతున్న  విజయవాడకు చెందిన ప్రసాద్(70)ను కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ప్రసాద్ తీవ్రంగా గాయపడగా గమనించిని స్థానికులు వెంటనే అతనిని విజయవాడ ప్రైవేట్ హాస్పటల్‌కు తరలిచారు.. చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.  

Similar News

News November 14, 2024

కృష్ణా: విద్యార్థులకు అలెర్ట్.. అకడమిక్ క్యాలెండర్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో LLB & BA.LLB కోర్సులకు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్ విడుదలైంది. ప్రతీ సెమిస్టర్‌లో 90 పని దినాలు, ప్రణాళికాబద్ధంగా పరీక్షలు జరిగేలా క్యాలెండర్‌ను రూపొందించామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఇంటర్నల్, థియరీ, ప్రాక్టికల్ పరీక్షల తేదీల వివరాలకు https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్‌లో అకడమిక్ క్యాలెండర్‌ను చూడవచ్చు. 

News November 14, 2024

కృష్ణా: ప్రయాణికుల రద్దీ మేరకు ప్రత్యేక రైళ్లు 

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా సికింద్రాబాద్(SC), లక్నో(LKO) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైళ్లు నవంబర్ 15, 22 తేదీలలో SC- LKO(నం.07084), నవంబర్ 18, 25 తేదీలలో LKO-SC(నం.07083) మధ్య ఈ ట్రైన్లు నడుపుతామన్నారు. ఈ ప్రత్యేక రైళ్లు విజయవాడతో పాటు గుంటూరు, ఏలూరు, రాజమండ్రి, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళంతో పాటు ఏపీలోని పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు. 

News November 14, 2024

బాలలే దేశ భవిష్యత్.. గవర్నర్ అబ్దుల్ నజీర్ 

image

బాలల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ బాలలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన విజయవాడ రాజ్‌భవన్ నుంచి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. దివంగత భారత ప్రధాని పండిట్ నెహ్రు జన్మదినమైన ఈ రోజు ఆయనను స్మరించుకోవాలన్నారు. పిల్లలే దేశ భవిష్యత్ అని, ఉత్తమ పౌరులుగా వారిని తీర్చిదిద్దాలని గవర్నర్ స్పష్టం చేశారు.