News February 6, 2025
విజయవాడ: డిజిటల్ అరెస్టుతో భారీ మోసం
డిజిటల్ అరెస్ట్ పేరుతో ఓ వ్యక్తి నుంచి సైబర్ నేరగాళ్లు రూ.1.48 కోట్లు దోచేశారు. భారతీ నగర్కు చెందిన ఓ ఉద్యోగి నుంచి సైబర్ నేరగాళ్లు మీపై కేసు నమోదైందంటూ ఆ వ్యక్తి నుంచి రూ.3.46 లక్షలు ఓసారి, రూ.కోటి మరోసారి, ఆ తర్వాత రూ.25 లక్షలు, రూ.2 లక్షలు, రూ.20 లక్షలు జమ చేయించుకున్నారు. దీంతో బాధితుడు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నగదు BNGLR, HYD, KOLAKATAలలో బ్యాంకుల్లోకి వెళ్లినట్లు తేలింది.
Similar News
News February 6, 2025
బెల్లంపల్లిలో పెద్దపులి సంచారం
గత కొన్ని రోజులుగా బెల్లంపల్లి, కాసిపేట మండలాల అటవీ పరిసర ప్రాంత గ్రామాల ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న పెద్దపులి రేంజ్ పరిధిలో ఆవాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్నట్లుగా అటవీశాఖ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గురువారం పెద్దనపల్లి గ్రామపంచాయతీ మన్నెగూడ గ్రామ శివారులో పులి అడుగులను అధికారులు గుర్తించారు. కాగా ఎటువైపు నుంచైనా పశువులపై దాడి చేస్తుందోనని రైతులు భయాందోళనలకు గురవుతున్నారు.
News February 6, 2025
SV అగ్రికల్చర్ వర్సిటీకి బాంబు బెదిరింపు
తిరుపతి SV అగ్రికల్చర్ యూనివర్సిటీకి బాంబు బెదిరింపు వచ్చిందని కళాశాల సిబ్బంది తెలిపారు. హ్యూమన్ ఐఈడీ బాంబుతో పేల్చేస్తామంటూ గురువారం ఉదయం కళాశాలకు మెయిల్ వచ్చిందన్నారు. కేరళ నుంచి ఈ మెయిల్ వచ్చినట్టు వారు చెబుతున్నారు. కళాశాల అధికారుల ఫిర్యాదు మేరకు.. తిరుపతి ఎస్పీ సూచనలతో సీఐ చినగోవిందు వర్సిటీలో తనిఖీలు చేపట్టారు.
News February 6, 2025
పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తే కఠిన చర్యలు: CLP
TG: పార్టీ విధానాలను సొంత పార్టీ నేతలే తప్పుపడుతుండటంపై కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (CLP) మీటింగ్లో నేతలు చర్చలు జరిపారు. పార్టీ నిర్ణయాలను వ్యతిరేకించే వారిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తుంటే ప్రజల్లోకి చెడు సంకేతాలు వెళ్తాయని, ఏవైనా విభేదాలుంటే అంతర్గతంగా చర్చించుకోవాలని సీఎం రేవంత్ ఆదేశించినట్లు సమాచారం.