News February 6, 2025
విజయవాడ: డిజిటల్ అరెస్టుతో భారీ మోసం

డిజిటల్ అరెస్ట్ పేరుతో ఓ వ్యక్తి నుంచి సైబర్ నేరగాళ్లు రూ.1.48 కోట్లు దోచేశారు. భారతీ నగర్‌కు చెందిన ఓ ఉద్యోగి నుంచి సైబర్ నేరగాళ్లు మీపై కేసు నమోదైందంటూ ఆ వ్యక్తి నుంచి రూ.3.46 లక్షలు ఓసారి, రూ.కోటి మరోసారి, ఆ తర్వాత రూ.25 లక్షలు, రూ.2 లక్షలు, రూ.20 లక్షలు జమ చేయించుకున్నారు. దీంతో బాధితుడు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నగదు BNGLR, HYD, KOLAKATAలలో బ్యాంకుల్లోకి వెళ్లినట్లు తేలింది.
Similar News
News April 16, 2026
విశాఖ-లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ రీషెడ్యూల్

విశాఖపట్నం-లోకమాన్య తిలక్ టెర్మినస్ (18519) ఎక్స్‌ప్రెస్ రైలు రీషెడ్యూల్ అయినట్లు సీనియర్ డీసీఎం కె.పవన్ కుమార్ తెలిపారు. లింక్ రైలు ఆలస్యంగా రావడం వల్ల ఏప్రిల్ 16 రాత్రి 11:20 గంటలకు బయలుదేరాల్సిన ఈ రైలు, ఏప్రిల్ 16 అర్ధరాత్రి 12:30 గంటలకు విశాఖ నుంచి బయలుదేరుతుంది. ప్రయాణికులు ఈ మార్పును గమనించి సహకరించాలని అధికారులు కోరారు.
News April 16, 2026
మార్కెట్ షేర్‌లో మారుతీ రివర్స్ గేర్

2026 ఆర్థిక సంవత్సరంలో మారుతీ సుజుకీ మార్కెట్ షేర్ 39.26%కి పడిపోయింది. 13 ఏళ్లలో ఇదే కనిష్ఠం. ఒకప్పుడు సగానికి పైగా మార్కెట్‌ను ఏలిన మారుతీ.. పెరుగుతున్న పోటీ, కస్టమర్ల అభిరుచులు మారడంతో వరుసగా మూడో ఏడాదీ వెనకబడింది. 2020 నుంచి చూస్తే కంపెనీ ఏకంగా 12% మార్కెట్ షేర్‌ను కోల్పోయిందని SIAM గణాంకాలు చెబుతున్నాయి. ఇతర కంపెనీల SUVs హవా పెరగడమే మారుతీకి నెగటివ్‌గా మారినట్లు స్పష్టమవుతోంది.
News April 16, 2026
భద్రాద్రిలో కనులపండువగా నిత్య కళ్యాణం

భద్రాద్రి క్షేత్రంలో శ్రీ సీతారాముల నిత్య కళ్యాణ వేడుక వైభవంగా జరిగింది. వేసవి సెలవుల నేపథ్యంలో భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం అధికారులు తాగునీరు, చలువ పందిళ్లు వంటి ముందస్తు సౌకర్యాలు కల్పించారు. ఆలయ ప్రాంగణం భక్తుల జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగింది.


