News February 7, 2025

విజయవాడ డివిజన్లో పలు రైళ్లు దారి మళ్లింపు

image

విజయవాడ డివిజన్లో పలు రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. SHM-HYD (18045) SHM-MGR (12841), DHN-ALLP(13351), SRC-MGR(22807) TATA-SBC(12889) ఎక్స్‌ప్రెస్ రైలు నిడదవోలు గుడివాడ విజయవాడ మీదుగా సీఎస్‌టీ ముంబై భువనేశ్వర్ (11019), బెంగళూరు-గౌహతి (12309) రైళ్లను విజయవాడ, గుడివాడ, నిడదవోలు మీదుగా దారి మళ్లించారు. 

Similar News

News September 16, 2025

బాలికపై అత్యాచారం.. నల్గొండ కోర్టు సంచలన తీర్పు

image

నల్గొండ పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నాలుగో తరగతి బాలికపై లైంగిక దాడికి పాల్పడిన 60 ఏళ్ల ఊశయ్యకు 24 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ పోక్సో కోర్టు న్యాయమూర్తి రోజా రమణి తీర్పు చెప్పారు. రూ.40 వేల జరిమానాతో పాటు బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించారు.

News September 16, 2025

ఖమ్మం: విదేశీ విద్యకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఖమ్మం జిల్లాకు చెందిన బీసీ, ఈబీసీ విద్యార్థుల విదేశీ విద్య కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి జ్యోతి తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరంలో విదేశాలకు వెళ్లి చదువుకోవాలనే ఆసక్తి ఉన్నవారు ఈ నెల 24 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు, వారి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 5 లక్షల లోపు ఉండాలని పేర్కొన్నారు.

News September 16, 2025

ఎస్.ఐ.ఆర్ నిర్వహణకు అధికారులను సన్నద్ధం చేయాలి

image

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్(ఎస్.ఐ.ఆర్)పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం సమీక్ష నిర్వహించారు. 2002లో జరిగిన ఎస్.ఐ.ఆర్ డేటాను ప్రస్తుత 2025 జాబితాతో పోల్చి తప్పుడు వివరాలను గుర్తించి సరిదిద్దాల్సిన అవసరం ఉన్నట్లు తెలిపారు. ప్రతి బూత్ సిబ్బందికి పూర్తి అవగాహన కల్పించి, ప్రతిరోజు లక్ష్యాలతో కార్యాచరణ చేపట్టాలని సూచించారు.