News February 7, 2025
విజయవాడ డివిజన్లో పలు రైళ్లు దారి మళ్లింపు

విజయవాడ డివిజన్లో పలు రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. SHM-HYD (18045) SHM-MGR (12841), DHN-ALLP(13351), SRC-MGR(22807) TATA-SBC(12889) ఎక్స్‌ప్రెస్ రైలు నిడదవోలు గుడివాడ విజయవాడ మీదుగా సీఎస్‌టీ ముంబై భువనేశ్వర్ (11019), బెంగళూరు-గౌహతి (12309) రైళ్లను విజయవాడ, గుడివాడ, నిడదవోలు మీదుగా దారి మళ్లించారు.
Similar News
News February 12, 2026
సంక్రాంతి సంబరాల కేసు.. అంబటికి రిమాండ్

AP: సంక్రాంతి వేళ లక్కీ డ్రా కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు స్పెషల్ ప్రిన్సిపల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. CM CBNపై అనుచిత వ్యాఖ్యలు సహా మరో కేసులో రాంబాబుకు ఇప్పటికే బెయిల్ లభించింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలవుతారని YCP శ్రేణులు భావించాయి. కానీ తాజాగా మరో కేసులో రిమాండ్ విధించడంతో ఇప్పట్లో విడుదలయ్యే అవకాశం కనిపించడం లేదు.
News February 12, 2026
మాజీ సీఎంసంజీవయ్య జన్మదిన వేడుకలను జయప్రదం చేయండి: కలెక్టర్

అనంతపురం జిల్లా కలెక్టరేట్లో ఈ నెల 14న ఏపీ తొలి దళిత మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 105వ జన్మదిన వేడుకలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 14న ఉదయం 10:30 గంటలకు రెవెన్యూ భవన్లో కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ ఉత్సవాలకు జిల్లా అధికారులు, దళిత నాయకులు, ప్రజా ప్రతినిధులు హాజరై కార్యక్రమాన్ని జయప్రదం కలెక్టర్ పిలుపునిచ్చారు.
News February 12, 2026
బాల భీముడు.. 5.20KGల బరువుతో జననం

TG: సాధారణంగా నవజాత శిశువులు పుట్టగానే 2.5-3.5 కిలోల బరువుంటారు. కొన్నిచోట్ల 4 కేజీల బరువుతోనూ జన్మించారు. అయితే భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో సంధ్యారాణి అనే మహిళ సీ సెక్షన్ ద్వారా 5.20 కేజీల బరువున్న మగబిడ్డకు జన్మనిచ్చారు. దీంతో ఈ బాల భీముడిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.


