News January 31, 2025
విజయవాడ: డ్రోన్లతో ఈవ్ టీజింగ్‌కు అడ్డుకట్ట

ఆధునిక సాంకేతికత ఉపయోగించి నేరాలను కట్టడి చేస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా పోలీసులు గురువారం తమ అధికారిక ట్విటర్ ఖాతాలో ట్వీట్ చేశారు. డ్రోన్లతో స్కూల్స్, కాలేజీ పరిసరాలలో ఈవ్ టీజింగ్ జరగకుండా, బహిరంగ ప్రదేశాలలో మద్యం/ గంజాయి సేవించే వ్యక్తులను గుర్తిస్తున్నామని తెలిపారు. డ్రోన్లతో పహారా కాస్తూ అసాంఘిక కార్యక్రమాలు జరుగు ప్రదేశాలు గుర్తించి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
Similar News
News November 5, 2025
ఇంటి చిట్కాలు

* కార్పెట్లను శుభ్రం చేయడానికి పావుకప్పు వెనిగర్, చెంచా మొక్కజొన్న పిండి, పావు కప్పు నీరు కలపాలి. ఈ మిశ్రమాన్ని కార్పెట్ల మీద చల్లి ఐదు నిమిషాలు ఉంచాలి. తర్వాత వాక్యూమ్ క్లీనర్‌తో శుభ్రం చేస్తే సరిపోతుంది.
* చెంచా కాఫీపొడి, గుప్పెడు పుదీనా ఆకులు, చెంచా బేకింగ్ సోడా, కాసిన్ని నిమ్మతొక్కలు, కొద్దిగా నిమ్మరసం ఒక గిన్నెలో వేసి ఒక మూలన ఉంచితే గది అంతా పరిమళం వ్యాపిస్తుంది.
News November 5, 2025
రోడ్డు ప్రమాదం.. నలుగురు TG వాసుల మృతి

కర్ణాటకలోని హల్లిఖేడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యాను, కారు ఢీకొనడంతో నలుగురు తెలంగాణ వాసులు మరణించగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను సంగారెడ్డి(D) జగన్నాథ్‌పూర్ వాసులుగా గుర్తించారు. గణగాపూర్ దత్తాత్రేయ ఆలయానికి వెళ్లి కారులో తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ‘మీర్జాగూడ’ ప్రమాదంలో 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
News November 5, 2025
SRD: ఘోర రోడ్డు ప్రమాదం.. నారాయణఖేడ్ వాసులు మృతి

కర్ణాటక రాష్ట్రం హోళికేడ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నారాయణఖేడ్ మండలం జగన్నాథ్‌పూర్ గ్రామానికి చెందిన ముగ్గురు బుధవారం మృతి చెందారు. కర్ణాటక రాష్ట్రంలోని గానుగాపూర్ దత్తాత్రేయ స్వామి క్షేత్రాన్ని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


