News June 29, 2024

విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వచ్చేవారికి ముఖ్య సూచన

image

వీఐపీలు, దివ్యాంగులు, వృద్ధులు, అన్ని శాఖల అధికారులు ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దర్శనానికి ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30లోపు రావొద్దని EO కేఎస్ రామారావు విజ్ఞప్తి చేశారు. ఉదయం 11.45- మధ్యాహ్నం 12.45 వరకు మహా నైవేద్యం జరుగుతుందని, అందువలన ఈ విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. దేవస్థానంలో అభివృద్ధి పనులు జరుగుతున్నందున ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30లోపు, మినహా మిగతా సమయాల్లో దర్శనానికి రావాలన్నారు.

Similar News

News September 21, 2024

విజయవాడ: మరోసారి బాడీ స్పా సెంటర్‌పై దాడి

image

విజయవాడ బందర్ రోడ్డులో బాడీ స్పా సెంటర్ పై శనివారం పోలీసులు దాడి చేశారు. మాచవరం -టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా కలిసి బాడీ మసాజ్ సెంటర్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురు యువతులు, ఇద్దరి యువకులను అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరు బాడీ మసాజ్ పేరిట క్రాస్ మసాజ్ నిర్వహిస్తున్నట్లు సీఐ ప్రకాశ్ చెప్పారు. కాగా శుక్రవారం సాయంత్రం సైతం బాడీ మసాజ్ సెంటర్‌పై పోలీసులు దాడి చేసిన విషయం తెలిసిందే.

News September 21, 2024

కృష్ణా: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

విజయవాడ మీదుగా పుదుచ్చేరి(PDY)-హౌరా(HWH) మధ్య ప్రయాణించే 2 సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లకు రాజమండ్రిలో దక్షిణ మధ్య రైల్వే ప్రయోగాత్మకంగా స్టాప్ ప్రవేశపెట్టింది. ప్రయాణికుల సౌలభ్యం మేరకు రాజమండ్రిలో ఇచ్చిన ఈ స్టాప్‌ను పొడిగిస్తున్నామని రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు నం.12868 PDY-HWH రైలు ఈ నెల 25 నుంచి, నం.12867 HWH-PDY రైలు ఈ నెల 22 నుంచి రాజమండ్రిలో ఆగుతాయన్నారు.

News September 21, 2024

కృష్ణా: డిగ్రీ 5వ సెమిస్టర్ పరీక్షల టైంటేబుల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 5వ సెమిస్టర్(Y22 బ్యాచ్) రెగ్యులర్ పరీక్షల టైంటేబుల్ విడుదలైంది. నవంబర్ 15 నుంచి 30 మధ్య నిర్ణీత తేదీలలో ఈ పరీక్షలు జరుగుతాయని ANU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టువారీగా టైం టేబుల్ పూర్తి వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలని సూచించింది.