News March 30, 2025
విజయవాడ దుర్గమ్మ ప్రసాదంలో మేకు

విజయవాడ ఇంద్ర కీలాద్రి అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. అమ్మవారి ప్రసాదంలో మేకు వచ్చిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. భక్తుల వివరాల మేరకు.. కొందరు భక్తులు శుక్రవారం అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు. అనంతరం వారు మహా మండపం కింద 4 వ ప్రసాదం కౌంటర్లో పులిహోర పొట్లాలు కొనుగోలు చేశారు. వారు ప్రసాదం తింటుండగా మేకు రావడంతో అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News December 3, 2025
భువనగిరి: అధికారుల నిర్లక్ష్యం.. తప్పుల తడకగా ఓటర్ జాబితా!

సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ప్రకటించిన ఓటరు జాబితా తప్పుల తడకగా ఉంది. ఓటరు జాబితాలో మృతిచెందిన వారి పేర్లు ఉండడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఏడాది క్రితం మృతిచెందిన భువనగిరి మండలం నమాత్‌పల్లికి చెందిన ఎల్లయ్య పేరు జాబితాలో ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇదొక్కటే కాదు యాదాద్రి జిల్లాలో చాలాచోట్ల ఒకరి ఫొటో బదులు మరొకరి ఫొటో ఉండడం, పేర్లు మారడం ఇలా తప్పుల తడకగా ఉంది.
News December 3, 2025
సిద్దిపేట సీపీ పేరుతో నకిలీ ఫేస్బుక్ అకౌంట్

సిద్దిపేట సీపీ విజయ్‌కుమార్ పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఫేస్బుక్ ఖాతా తెరిచారు. ఈ ఖాతా ద్వారా పలువురికి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపడంతో విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ విషయం సీపీ విజయ్‌కుమార్ దృష్టికి వెళ్లడంతో వెంటనే ఆ నకిలీ ఖాతాను బ్లాక్ చేయించారు. తనకు ఫేస్బుక్ ఖాతా లేదని, ఇలాంటి రిక్వెస్ట్‌లకు స్పందించవద్దని ప్రజలకు ఆయన సూచించారు.
News December 3, 2025
KNR: ‘అన్నా మాతో కాదే’.. తప్పుకుంటోన్న అభ్యర్థులు..?

పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు అనుకూలించినా ‘అన్నా మాతో కాదే’ అంటూ కొన్నిచోట్ల అభ్యర్థులు నామినేషన్ల ఆఫర్లను రిజెక్ట్ చేస్తున్నారు. గతంలో ముఖంచూసి ఓట్లు వేసేవారని, ఇప్పుడు లకారాలు(డబ్బు) పెట్టినా గెలుపు కష్టమనే అభిప్రాయాలు పెరిగాయి. బిల్లులు రాక పాత సర్పంచ్‌లు ఇబ్బందులు పడుతుంటే, పోటీకి దిగేందుకు చాలామంది ఆసక్తి చూపించట్లేదు. ఉమ్మడి KNR వ్యాప్తంగా అక్కడక్కడా ఈ పరిస్థితి నెలకొంది. దీనిపై మీ COMMENT.


