News October 6, 2024
విజయవాడ: దుర్గమ్మ రేపు ఏ అవతారంలో దర్శనమిస్తారంటే?
శరన్నవరాత్రులలో భాగంగా దుర్గమ్మ రేపు ఆదివారం నాలుగో రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. శ్రీ లలితా దేవి తనను కొలిచిన భక్తుల దారిద్ర దుఃఖాలు నశింపచేస్తుందని పండితులు తెలిపారు. చెరకుగడ, విల్లు, పాశము, అంకుశము ధరించిన అమ్మవారు భక్తుల ఇక్కట్లు తొలగించి, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందన్నారు.
Similar News
News November 12, 2024
అసెంబ్లీ విప్‌లుగా బోండా ఉమ, యార్లగడ్డ, తంగిరాల సౌమ్య
శాసన సభ, శాసనమండలి చీఫ్ విప్, విప్‌లను కాసేపటి క్రితం ప్రభుత్వం ఖరారు చేసింది. ఇద్దరు చీఫ్ విప్‌లతో పాటు 15 మందిని విప్‌లుగా నియమించింది. శాసన సభ చీఫ్ విప్‌గా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, శాసన మండలి చీఫ్ విప్‌గా పంచుమర్తి అనురాధ నియమితులయ్యారు. ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి బోండా ఉమ(విజయవాడ సెంట్రల్), తంగిరాల సౌమ్య(నందిగామ), యార్లగడ్డ వెంకట్రావు(గన్నవరం) అసెంబ్లీ విప్‌లుగా అవకాశం లభించింది.
News November 12, 2024
కృష్ణా: రేపటితో ముగియనున్న ఉద్యోగాల దరఖాస్తు గడువు
కృష్ణా: APCRDAలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 19 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ రేపటితో ముగియనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా GIS & రిమోట్ సెన్సింగ్ అసిస్టెంట్(6), హెల్త్ & సేఫ్టీ స్పెషలిస్ట్(4) తదితర ఉద్యోగాలను APCRDA భర్తీ చేయనుంది. అభ్యర్థులు నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలు, అప్లై చేసేందుకు https://crda.ap.gov.in/Careers/General అధికారిక వెబ్‌సైట్ చూడవచ్చు.
News November 12, 2024
ఈ నెల 13న కృష్ణలంకలో జిల్లా ఫెన్సింగ్ జట్ల ఎంపిక
విజయవాడ: కృష్ణలంకలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నవంబర్ 13న ఎస్జీఎఫ్ అండర్19 ఉమ్మడి కృష్ణా జిల్లా ఫెన్సింగ్ జట్ల ఎంపిక నిర్వహిస్తున్నట్లు జిల్లా అండర్ 19 ఎస్జీఎఫ్ కార్యదర్శి రవికాంత్ తెలిపారు. ఈ పోటీలకు 01జనవరి2006 తరువాత పుట్టినవారు అర్హులన్నారు. జిల్లాలో ఆసక్తి గలవారు జనన ధ్రువీకరణ, స్టడీ, ఆధార్ పత్రాలతో హాజరుకావాలన్నారు. ఐటీఐ, పాలిటెక్నిక్, ఓపెన్‌గా చదివేవారు అనర్హులని చెప్పారు.