News September 14, 2024
విజయవాడ: ధనుష్ సినిమా మళ్లీ థియేటర్లలోకి వస్తోంది
ధనుష్, శృతిహాసన్ జంటగా నటించిన ‘3’ (2012) సినిమా సెప్టెంబర్ 14న రీరిలీజ్ కానుంది. సెప్టెంబర్ 14 నుంచి 16 వరకు విజయవాడలోని నాలుగు థియేటర్‌లలో ఈ సినిమా ప్రదర్శించనున్నారు. కాగా ఈ చిత్రంలోని “వై దిస్ కొలవెరి”తో పాటు ఇతర పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో విజయవాడలో ఈ సినిమా టికెట్లు ఆన్‌లైన్‌లో వేగంగా అమ్ముడవుతున్నాయి.
Similar News
News October 5, 2024
8న కృష్ణాజిల్లా రైఫిల్ షూటింగ్ జట్ల ఎన్నికలు
తాడిగడపలోని పులిపాక రోడ్డులో గల ది ఇండియన్ షూటింగ్ స్పాట్ అకాడమీలో అక్టోబర్ 8న రైఫిల్ షూటింగ్ జట్ల ఎంపికలను నిర్వహిస్తున్నట్లు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల ఎస్జీఎఫ్ కార్యదర్శులు శ్రీను, ఏం.శ్రీనివాస్ తెలిపారు. ఈ ఎంపికలు పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో అండర్- 14, 17 బాల, బాలికలకు జరుగుతాయన్నారు. జిల్లాలో ఆసక్తి గలవారు ఉదయం 9 గంటలకు జిల్లా ఎస్జీఎఫ్ ఎంట్రీ ఫామ్‌తో హాజరుకావాలన్నారు.
News October 5, 2024
రైతులు ఈ పంటను నమోదు చేయించుకోవాలి: కలెక్టర్
రైతులు ఈ పంటను నమోదు చేయించుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. శనివారం గూడూరు మండలం రామరాజు పాలెం గ్రామ పరిధిలో జరిగే ఈ-పంట నమోదును కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ పంట నమోదు ప్రక్రియను పూర్తిస్థాయిలో త్వరగా చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. రైతులు పండించిన ధాన్యం విక్రయాలకు ఈ పంట నమోదు తప్పనిసరి అని చెప్పారు.
News October 5, 2024
నూజివీడు ట్రిపుల్ ఐటీకి 6 నుంచి దసరా సెలవులు
రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ పరిధిలో ఉన్న నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు ఈనెల 6 నుంచి 13 వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లు ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్ ఆచార్య అమరేంద్ర కుమార్ శనివారం తెలిపారు. తిరిగి ట్రిపుల్ ఐటీలు ఈనెల 14 నుంచి పునః ప్రారంభమవుతాయని చెప్పారు. నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు దూర ప్రాంతాల్లోని తమ ఇళ్లకు వెళ్లేందుకు 45 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశామన్నారు.