News October 26, 2024
విజయవాడ నుంచి శ్రీకాకుళానికి ఇంద్ర ఏసీ బస్సు
ప్రయాణికుల సౌకర్యార్థం విజయవాడ నుంచి శ్రీకాకుళానికి ప్రతి రోజూ ఇంద్ర AC బస్సు నడుపుతున్నామని RTC ఒక ప్రకటనలో తెలిపింది. రాత్రి 8.40 గంటలకు విజయవాడలో బయలుదేరే ఈ బస్సు మరుసటి రోజు ఉదయం 7 గంటలకు శ్రీకాకుళం చేరుకుంటుందని, తిరుగుప్రయాణంలో సాయంత్రం 6 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4:50 గంటలకు విజయవాడ చేరుకుంటుందని, ప్రయాణికులు ఈ సర్వీసును ఆదరించాలని RTC వర్గాలు విజ్ఞప్తి చేశాయి.
Similar News
News November 10, 2024
కృష్ణా: ANU దూరవిద్య MBA, MCA ఎంట్రన్స్ ఫలితాల విడుదల
ANU దూరవిద్య కేంద్రంలో MBA, MCA కోర్సుల ప్రవేశాలకు ఈ నెల 9 నిర్వహించిన అర్హత పరీక్ష ఫలితాలను దూరవిద్య కేంద్రం డైరెక్టర్ వెంకటేశ్వర్లు, కో ఆర్డినేటర్ రామచంద్రన్ ఆదివారం విడుదల చేశారు. ఈ పరీక్షలకు 201 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 188 మంది పరీక్షకు హాజరయ్యారని, 184 మంది అర్హత సాధించారని చెప్పారు. అర్హత సాధించిన వారికి ఈ నెల 15లోగా ప్రవేశాలు కల్పిస్తామన్నారు.
News November 10, 2024
విజయవాడ: భవానీ దీక్షల మాలధారణ, విరమణ తేదిలివే!
ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల కార్యక్రమ సన్నాహకాలపై శనివారం ఆలయ EO కేఎస్ రామారావు, CP రాజశేఖరబాబుతో సమావేశమయ్యారు. ఈ నెల 11- 15 వరకు భవానీ దీక్షల మాలధారణ, డిసెంబర్ 14న కలశజ్యోతి, డిసెంబర్ 21- 25 వరకు దీక్షల విరమణ జరుగుతాయని CP రాజశేఖరబాబు చెప్పారు. ఆయా కార్యక్రమాలను విజయవంతం చేసేలా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చేయాల్సిన ఏర్పాట్లపై ఈ సమావేశానికి హాజరైన అధికారులతో సీపీ చర్చించారు.
News November 10, 2024
రేపు విజయవాడకు సీఎం చంద్రబాబు
భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదినం సందర్భంగా రేపు సోమవారం విజయవాడలో మైనార్టీ సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరవుతారని ఉర్దూ అకాడమీ డైరెక్టర్ మస్తాన్ వలీ తెలిపారు. కార్యక్రమంలో ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసినవారికి, పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయులకు అవార్డులను ప్రదానం చేస్తామన్నారు.