News April 2, 2025
విజయవాడ నూతన సిటీ ప్లానర్ బాధ్యతల స్వీకరణ

విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్లో సిటీ ప్లానర్‌గా సంజయ్ రత్నకుమార్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బుధవారం అయిన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆయనను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం ఇరువురు నగరంలోని పలు అభివృద్ధి పనులపై చర్చించారు.
Similar News
News December 7, 2025
తిరుపతి: మరో ప్రొఫెసర్ది అదే డిపార్ట్మెంట్.!

తిరుపతి NSUలో యువతిపై వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ ఎడ్యూకేషన్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్నారు. వీడియో తీసి బెదిరింపులకు దిగినట్లు ఆరోపిస్తున్న మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ అదే విభాగానికి చెందిన శేఖర్ రెడ్డి అన్న చర్చ నడుస్తోంది. అతను ‘నాకు సంబంధం లేకుండా నా పేరు తెచ్చారు’ అని సిబ్బందితో మట్లాడినట్లు సమాచారం.
News December 7, 2025
తిరుపతి: వర్సిటీ ICC ఏమి చేసింది.!

తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో యువతిపై వేధింపుల కేసులో INTERNAL COMPLAINT COMMITY (ICC) ఇద్దరు ప్రొఫెసర్లను విచారించినట్లు చర్చ నడుస్తుంది. ఈ కమిటీలోని నలుగురు సభ్యులు అసిస్టెంట్ ప్రొ.లక్ష్మణ్ కుమార్‌ను ప్రశ్నించగా ‘యువతిని తీసుకురాండి.. నాపై అనవసరంగా ఫిర్యాదు చేసింది’ అని చెప్పినట్లు సమాచారం.
News December 7, 2025
37 మంది ఎమ్మెల్యేల పనితీరు మెరుగవ్వాలి: చంద్రబాబు

AP: ఎమ్మెల్యేలతో వన్ టూ వన్ మీటింగ్‌లతో వారి పనితీరు మెరుగుపడిందని సీఎం చంద్రబాబు అన్నారు. మరో 37 మంది ఎమ్మెల్యేల పనితీరు మరింత మెరుగుపడాల్సి ఉందన్నారు. అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో అందుబాటులో ఉన్న నేతలతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రతి ఒక్కరి పనితీరుపైన సర్వే నివేదికలు తెప్పించుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. పదవులు ఆశించకుండా పార్టీ కేడర్‌ను సిద్ధం చేసుకోవాలని నేతలకు మార్గనిర్దేశం చేశారు.


