News February 25, 2025

విజయవాడ : నేడు పోలీస్ కస్టడీకి వల్లభనేని వంశీ

image

కిడ్నాప్ కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మోహన్‌ను ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు మూడు రోజులు పోలీస్ కస్టడీకి అనుమతించింది. ఈ క్రమంలో నేటి నుంచి మూడు రోజుల పాటు వంశీని పోలీస్ కస్టడీలో విచారించనున్నారు. మరోవైపు గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వంశీ పై పోలీసులు పీటీ వారెంట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం కోర్టులో హాజరు పరచాలని థర్డ్ ఏసీఎం కోర్టు ఆదేశించింది.

Similar News

News February 24, 2026

NLG: ఖాళీలతో కునారిల్లుతున్న మున్సిపాలిటీలు

image

ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో కొలువుదీరిన కొత్త పాలక వర్గాలకు క్షేత్రస్థాయిలో సవాళ్లు ఎదురవుతున్నాయి. ఒకవైపు నిధుల కొరత, మరోవైపు సిబ్బంది లేమి పట్టణాల అభివృద్ధికి ఆటంకంగా మారాయి. కొత్తగా ఏర్పాటైన చిన్న మున్సిపాలిటీల్లో పరిస్థితి దారుణంగా ఉంది. NLG, SRPT, BNG, DVK, HZNR, MLG తదితర మున్సిపాలిటీల్లో సిబ్బంది కొరత వేధిస్తోంది. శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు కూడా ఖాళీగానే ఉన్నాయి.

News February 24, 2026

అధ్యక్షా నుంచి ఆటల పోటీల్లోకి..

image

AP: విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నేటి నుంచి 3 రోజుల పాటు MLAలు, MLCల లెజిస్లేచర్ స్పోర్ట్స్ మీట్ జరగనుంది. 14 రకాల ఆటల పోటీల్లో 154 మంది పాల్గొంటారు. క్రికెట్‌లో 6 జట్లకు సత్యకుమార్, అచ్చెన్న, కొల్లు, మండిపల్లి, నాదెండ్ల, పల్లా కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. టగ్‌ ఆఫ్ వార్‌లో 2 జట్లకు స్పీకర్ అయ్యన్న, Dy.స్పీకర్ రఘురామ కెప్టెన్లుగా ఉంటారు. ఒక త్రోబాల్‌ జట్టుకు మంత్రి అనిత సారథ్యం వహిస్తారు.

News February 24, 2026

నేడు వికారాబాద్‌లో జరిగేది ఇదే!

image

✓ నేడు పరిగిలో డయల్ యువర్ డీఎం
✓ తాండూరు (M) వార్డు మెంబర్లకు శిక్షణ తరగతులు
✓ కొడంగల్ సర్పంచ్‌లకు శిక్షణ తరగతులు
✓ కుల్కచర్ల రుక్మిణీ పాండురంగస్వామి వార్షికోత్సవాలు
✓ VKBలో కొనసాగనున్న డీసీసీల శిక్షణ తరగతులు
✓ 4 నియోజకవర్గాల్లో పర్యటించనున్న ఎమ్మెల్యేలు